సీక్వెల్‌ షురూ | Adivi Sesh announces Goodachari 2 on his birthday | Sakshi
Sakshi News home page

సీక్వెల్‌ షురూ

Dec 18 2018 2:40 AM | Updated on Jul 14 2019 4:31 PM

Adivi Sesh announces Goodachari 2 on his birthday - Sakshi

అడవి శేష్

సెట్స్‌లో ఉన్నప్పుడు ‘గూఢచారి’ చిన్న సినిమా. రిలీజయ్యాక పెద్ద సినిమా. తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి, పెద్ద సినిమా అయింది. అడవి శేష్, శోభిత, సుప్రియ తదితరులతో శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్‌ సీక్వెల్‌ పనులు మొదలయ్యాయి. ‘గూఢచారి’ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌కి అసిస్టెంట్‌గా చేసిన రాహుల్‌ పాకాల సీక్వెల్‌కి దర్శకత్వం వహించనున్నారు.

సోమవారం అడవి శేష్‌ పుట్టినరోజు సందర్భంగా సీక్వెల్‌ని అనౌన్స్‌ చేశారు. ‘‘రెండో భాగాన్ని భారీ బడ్జెట్‌తో ప్లాన్‌ చేశాం. ఫస్ట్‌ పార్ట్‌ సంచలనం సృష్టించిన నేపథ్యంలో సెకండ్‌ పార్ట్‌ ఇంకా పెద్ద స్కేల్‌లో ఉండాలన్నది మా ఆలోచన. వచ్చే ఏడాది షూటింగ్‌ ప్రారంభిస్తాం. 2020లో సినిమాని విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement