50 సినిమాలు తిరస్కరించా | Sakshi
Sakshi News home page

50 సినిమాలు తిరస్కరించా

Published Thu, Aug 2 2018 2:28 AM

Adivi Sesh all set to prove his mettle again - Sakshi

‘‘క్షణం’ రిలీజ్‌ తర్వాత ఓ 50 సినిమాలకు ఆఫర్‌ వచ్చింది. కానీ ఆ కథలు  నచ్చక ఒప్పుకోలేదు. మనసుకు నచ్చిన సినిమా చేస్తే అది ఫ్లాప్‌ అయినా సంతృప్తి ఉంటుంది. నచ్చని సినిమా చేసి, అది ఫ్లాప్‌ అయితే చాలా బాధగా ఉంటుంది. ‘క్షణం’ రిలీజ్‌ అయిన 20 రోజులకు ‘గూఢచారి’కి సంతకం చేశా’’ అని అడవి శేష్‌ అన్నారు. ఆయన హీరోగా నటించి, కథ అందించిన చిత్రం ‘గూఢచారి’. శోభిత ధూళిపాళ కథానాయిక. శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో అభిషేక్‌ నామా, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్‌ సుంకర ఈ శుక్రవారం ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అడవి శేష్‌ చెప్పిన చిత్ర విశేషాలు.

► నేను హీరోగా నటించి దర్శకత్వం వహించిన ‘కిస్‌’ విడుదల తర్వాత కొందరు నాతో ‘డైరెక్షన్‌ లేదా యాక్టింగ్‌.. ఏదో ఒకటే చేయండి. రెండూ కష్టం’ అన్నారు. కరెక్టే అనిపించింది. అప్పటి నుంచి డైరెక్షన్‌ చేయలేదు. నా డైరెక్షన్‌లో నేను నటించను.

► పది నెలలు కష్టపడి ‘గూఢచారి’ కథ రాశా. గతంలో నా సినిమా విడుదలవుతోందంటే ప్రేక్షకులకు నచ్చుతుందో? లేదో? అని నెర్వస్‌గా ఉండేది. కానీ నా కెరీర్‌లో ఫస్ట్‌ టైమ్‌ ‘గూఢచారి’ విషయంలో ప్రశాంతంగా ఉన్నా. సినిమా రషెస్‌ చూసిన వారి ఉత్సాహం చూస్తుంటే నెర్వస్‌నెస్‌ పోయి కాన్ఫిడెన్స్‌ వచ్చింది.

► ఓ సామాన్య స్టూడెంట్‌ ‘గూఢచారి’గా ఎలా మారాడు? అన్నదే కథ. ‘గూఢచారి 116’లో కృష్ణగారి కౌబాయ్‌ పాత్ర నన్ను ప్రభావితం చేసింది. మా సినిమాలో నటించమని ఆయన్ని అడిగాం. ఇప్పుడు నేను నటించడం లేదు అన్నారు.

► నా సినిమా, రాహుల్‌ చేసిన ‘చి..ల..సౌ’ శుక్రవారం విడుదలవుతుండటం పోటీగా భావించం. మా కలలు నెరవేర్చుకుంటున్నామనే సంతోషం. ‘చి..ల..సౌ’ చాలా బాగుంది.

► ప్రస్తుతం నేను చేస్తున్న ‘టు స్టేట్స్‌’ రీమేక్‌ 50 శాతం çపూర్తయింది. ఆ తర్వాత రామ్‌జీతో పీవీపీ బ్యానర్‌లో ఓ సినిమా, మరో కొత్త డైరెక్టర్‌తో మరో సినిమా ఉంటుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement