ఆహార యాత్రకు ఛలో ఛలో | Aditya Roy Kapur and Parineeti Chopra set to embark on a food yatra | Sakshi
Sakshi News home page

ఆహార యాత్రకు ఛలో ఛలో

Sep 11 2014 12:04 AM | Updated on Oct 5 2018 6:36 PM

ఆహార యాత్రకు ఛలో ఛలో - Sakshi

ఆహార యాత్రకు ఛలో ఛలో

విహార యాత్రలు తెలుసు కానీ, ఆహార యాత్ర గురించి విని ఉండరు. ఈ విచిత్రమైన యాత్రతో ఆదిత్యరాయ్ కపూర్, పరిణీతి చోప్రా బిజీ కానున్నారు.

విహార యాత్రలు తెలుసు కానీ, ఆహార యాత్ర గురించి విని ఉండరు. ఈ విచిత్రమైన యాత్రతో ఆదిత్యరాయ్ కపూర్, పరిణీతి చోప్రా బిజీ కానున్నారు. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘దావత్-ఇ-ఇష్క్’ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో ‘ఫుడ్’కి ప్రాధాన్యం ఉంది. అందుకని, ప్రచార కార్యక్రమాలను ఆహారం నేపథ్యంలో ప్లాన్ చేశారు చిత్రదర్శకుడు హబీబ్ ఫైసల్. దర్శకునిగా ఆయనకిది తొలి చిత్రం.
 
  సినిమాని ప్రేక్షకులకు దగ్గర చేయడానికి గత కొన్ని రోజులుగా భారీ ఎత్తున ప్రచార కార్యమ్రాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘ముంబయ్ టు చంఢీగడ్’ ఆహార యాత్ర ప్లాన్ చేశారు. ముంబయ్ నుంచి చంఢీగడ్ వరకు కారులో ప్రయాణిస్తారు ఆదిత్య, పరిణీతి. ఆ మార్గ మధ్యంలో కాకా హోటల్స్ మొదలుకుని స్టార్ హోటల్స్ వరకూ వెళ్లి, అక్కడ ప్రాచుర్యంలో ఉన్న వంటకాల్ని రుచి చూస్తుంది ఈ జంట. పనిలో పనిగా అక్కడివాళ్లకి ‘దావత్-ఇ-ఇష్క్’ సినిమా గురించి నాలుగు మంచి మాటలు చెబుతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement