
మరో హీరోయిన్ తల్లి కాబోతుంది. 2023లో రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకున్న ఈమె.. ఓవైపు సినిమాలు చేస్తోంది. ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పేసింది. ప్రస్తుతం తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని ప్రకటించింది. ఈ మేరకు భర్తతో కలిసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో తోటి సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 27 సినిమాలు)
చోప్రాస్ ఫ్యామిలీ నుంచి పరిణీతి.. 2012 నుంచి బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. ఇష్క్ జాదే, శుద్ద్ దేశీ రొమాన్స్, మేరీ ప్యారీ బిందు, కేసరి, అమర్ సింగ్ చమ్కీలా తదితర చిత్రాలు ఈమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. చెప్పాలంటే సెన్సేషనల్ హిట్ 'యానిమల్'లోనూ ఈమెనే తొలుత హీరోయిన్ అనుకున్నారు. కానీ తర్వాత ఆ ఛాన్స్ రష్మికని వరించింది.
ఓ సినిమా, వెబ్ సిరీస్ పూర్తి చేసింది. ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త ప్రాజెక్టులేం లేవు. ఈ క్రమంలోనే తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని పరిణీతి బయటపెట్టింది. ఈమె ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2023 సెప్టెంబరులో వీళ్లిద్దరూ ఒకటి కాగా.. ఇప్పుడు రెండేళ్లు ముగేసరికి తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని ప్రకటించారు. బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ జంటకు విషెస్ చెబుతున్నారు.
(ఇదీ చదవండి: ఎంతో బాధ అనుభవించా.. పెళ్లి వల్ల గుర్తింపు రాలేదు: ఉపాసన)