breaking news
Daawat-e-Ishq
-
భారీ అంచనాలతో 'ఆగడు'
ఆగడు విడుదల తేదీ 19-09-14 భాష- తెలుగు దర్శకుడు-శ్రీను వైట్ల నిర్మాతలు-అనిల్ శర్మ, ఆచంట గోపీనాథ్, ఆచంట రాము నటీ నటులు-మహేష్ బాబు, తమన్నా, బ్రహ్మానందం శుక్రవారం విడుదల కానున్న ఆగడు సినిమాపై అభిమానులే కాదు.. మహేష్ బాబు కూడా భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ఈ చిత్రం తన కెరీర్ లో మరో టర్నింగ్ పాయింట్ అవుతుందని మహేష్ భావిస్తున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఆగడు ఈ నెల 19న విడుదలవుతోంది. మిల్క్ బ్యూటీ తమన్నాకు మహేశ్ బాబు తో తొలిచిత్రం. ఇప్పటికే 'ఆగడు' చిత్రం విడుదల విషయంలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. ఒక్క అమెరికాలోనే ఏకంగా 159 స్క్రీన్లలో దీన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా అమెరికాలో ఇంత విస్తృత స్థాయిలో విడుదల కాకపోవడం గమనార్హం. ఖూబ్ సూరత్ విడుదల తేదీ 19-09-14 భాష- హిందీ దర్శకుడు-శశాంక ఘోష్ నిర్మాతలు-అనిల్ కపూర్, రియా కపూర్, సిద్ధార్ధ రాయ్ కపూర్ నటీ నటులు-ఫవాడ్ ఖాన్, సోనమ్ కపూర్, కిరణ్ ఖేర్ దావత్-ఈ-ఇష్క్ విడుదల తేదీ 19-09-14 భాష-హిందీ దర్శకుడు-హబీబ్ ఫైజల్ నిర్మాతలు-ఆదిత్య చోప్రా, యోగేంద్ర మోగ్రే నటీ నటులు-ఆదిత్య రాయ్ కపూర్, పరిణితీ చోప్రా -
ఆహార యాత్రకు ఛలో ఛలో
విహార యాత్రలు తెలుసు కానీ, ఆహార యాత్ర గురించి విని ఉండరు. ఈ విచిత్రమైన యాత్రతో ఆదిత్యరాయ్ కపూర్, పరిణీతి చోప్రా బిజీ కానున్నారు. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘దావత్-ఇ-ఇష్క్’ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో ‘ఫుడ్’కి ప్రాధాన్యం ఉంది. అందుకని, ప్రచార కార్యక్రమాలను ఆహారం నేపథ్యంలో ప్లాన్ చేశారు చిత్రదర్శకుడు హబీబ్ ఫైసల్. దర్శకునిగా ఆయనకిది తొలి చిత్రం. సినిమాని ప్రేక్షకులకు దగ్గర చేయడానికి గత కొన్ని రోజులుగా భారీ ఎత్తున ప్రచార కార్యమ్రాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘ముంబయ్ టు చంఢీగడ్’ ఆహార యాత్ర ప్లాన్ చేశారు. ముంబయ్ నుంచి చంఢీగడ్ వరకు కారులో ప్రయాణిస్తారు ఆదిత్య, పరిణీతి. ఆ మార్గ మధ్యంలో కాకా హోటల్స్ మొదలుకుని స్టార్ హోటల్స్ వరకూ వెళ్లి, అక్కడ ప్రాచుర్యంలో ఉన్న వంటకాల్ని రుచి చూస్తుంది ఈ జంట. పనిలో పనిగా అక్కడివాళ్లకి ‘దావత్-ఇ-ఇష్క్’ సినిమా గురించి నాలుగు మంచి మాటలు చెబుతారు.