పరువునష్టం కేసులో జియా ఖాన్ తల్లికి నోటీసులు | Aditya Pancholi, wife file Rs 100 crore defamation suit against Jiah Khan’s mother | Sakshi
Sakshi News home page

పరువునష్టం కేసులో జియా ఖాన్ తల్లికి నోటీసులు

Jul 9 2014 10:55 PM | Updated on Sep 2 2017 10:03 AM

నటుడు ఆదిత్య పంచోలీ దంపతులు దాఖలు చేసిన పరువునష్టం కేసుపై పది రోజుల్లోగా స్పందించాలని బాంబే హైకోర్టు ఆత్మహత్యకు పాల్పడిన నటి జియాఖాన్ తల్లి రజియా ఖాన్‌కు

ముంబై: నటుడు ఆదిత్య పంచోలీ దంపతులు దాఖలు చేసిన పరువునష్టం కేసుపై పది రోజుల్లోగా స్పందించాలని బాంబే హైకోర్టు ఆత్మహత్యకు పాల్పడిన నటి జియాఖాన్ తల్లి రజియా ఖాన్‌కు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఆదిత్య కొడుకు, జియా ప్రియుడు సూరజ్ ఆమె ఆత్మహత్యకు కారకుడని పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడం తెలిసిందే. రబియా తమను అవమానించేలా ట్విటర్‌లో వ్యాఖ్యలు పోస్టు చేసిందని పేర్కొంటూ ఆదిత్య దంపతులు దాఖలు చేసిన ఈ కేసుపై ఈ నెల 16న తదుపరి విచారణ జరగనుంది. జియా ఆత్మహత్య కేసు దర్యాప్తును హైకోర్టు ఇటీవలే సీబీఐకి బదిలీ చేయడం తెలిసిందే. గత ఏడాది జూన్ మూడున జియా జుహూలోని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీనికిముందు సూరజ్‌తో ఆమె కొన్నాళ్లపాటు సహజీవనం చేసి విడిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement