సీనియర్‌ నటుడికి ఏడాది జైలుశిక్ష | Aditya Pancholi Gets 1 Year Jail For Assaulting Neighbour | Sakshi
Sakshi News home page

సీనియర్‌ నటుడికి ఏడాది జైలుశిక్ష

Nov 6 2016 9:33 AM | Updated on Apr 3 2019 6:34 PM

సీనియర్‌ నటుడికి ఏడాది జైలుశిక్ష - Sakshi

సీనియర్‌ నటుడికి ఏడాది జైలుశిక్ష

పక్కింటి వ్యక్తిపై దాడి చేసిన కేసులో బాలీవుడ్‌ నటుడు ఆదిత్య పంచోలీకి ముంబై కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.

ముంబై: పక్కింటి వ్యక్తిపై దాడి చేసిన కేసులో బాలీవుడ్‌ నటుడు ఆదిత్య పంచోలీకి ముంబై కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అంధేరి మేజిస్ట్రేట్‌​ కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పినట్టు సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు చెప్పారు. న్యాయస్థానం 12 వేల రూపాయల పూచీకత్తుపై పంచోలీకి బెయిల్‌ మంజూరు చేసింది.

2005లో​ పంచోలీ.. ప్రతీక్‌ పస్రానీ అనే పొరుగు వ్యక్తితో గొడవపడ్డాడు. పంచోలీ ఫ్లాట్‌కు వచ్చిన  స్నేహితుడు.. ఈ బిల్డింగ్‌లో ప్రతీక్‌కు కేటాయించిన స్థలంలో వాహనాన్ని పార్క్‌ చేశాడు. ఇందుకు ప్రతీక్‌ అభ్యంతరం చెప్పడంతో పంచోలీ ఆయనపై దాడి చేశాడు. ప్రతీక్‌ ముక్కుకు ఫ్రాక్చర్‌ అయ్యింది. ప్రతీక్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు పంచోలీపై కేసు నమోదు చేశారు. 11 ఏళ్ల తర్వాత కోర్టు పంచోలీని దోషీగా నిర్ధారిస్తూ శిక్ష విధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement