ఆదిత్య వర్మ ట్రైలర్‌ వచ్చేసింది!

Adithya Varma Official Trailer Released - Sakshi

తెలుగులో అర్జున్‌రెడ్డి.. హిందీలో కబీర్‌ ఖాన్‌.. ఇప్పుడు తమిళంలో ఆదిత్యవర్మ. తెలుగు నాట సూపర్‌హిట్‌ అయిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా హిందీలోనూ ‘కబీర్‌ సింగ్’గా ప్రేక్షకుల ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. హిందీలోనూ ఈ సినిమా కథ మీద, ఈ సినిమాలో హీరో పాత్రను చూపించిన తీరు మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ భారీ వసూళ్లతో ఈ ఏడాది బిగ్గెస్ట్‌ హిట్స్‌లో ఒకటిగా నిలిచి ‘కబీర్‌ సింగ్‌’ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఇదే కథ త్వరలో తమిళ ప్రేక్షకులను ‘ఆదిత్య వర్మ’గా పలుకరించనుంది.

ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఇందులో తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ విక్రమ్‌ హీరోగా నటించారు. ఆయన సరసన బనితా సంధు కథానాయికగా నటించింది. అర్జున్‌ రెడ్డి కథ మనకు తెలిసిందే. అచ్చం తమిళంలోనూ సీన్‌ టు సీన్‌ అదే కథను తెరకెక్కించినట్టు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. కానీ, ఈ ట్రైలర్‌లో ధ్రువ్‌ తనదైన ఒరిజినల్‌, ఇంటెన్స్‌, రా నటనతో ఆకట్టుకున్నాడు. ప్రేమలో విఫలమైన వైద్యుడిగా, డ్రగ్‌, ఆల్కాహల్‌ ఆడిక్ట్‌గా ఎమోషనల్‌ సీన్లలో తనదైన నటనను కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

ఈ తమిళ ట్రైలర్‌పై ఇప్పటికే పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయినట్టు కనిపిస్తోంది. అన్నట్టు, బాలా దర్శకత్వంలో అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్‌ను పూర్తిస్థాయిలో తెరకెక్కించిన తర్వాత.. అది బాగా రాలేదని నిర్మాతలు పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త దర్శకుడు గిరాషాయా దర్శకత్వంలో మళ్లీ పూర్తిస్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించారు.  బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిత్యవర్మ’ టీజర్‌లో తమిళ నేపథ్యానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసినట్టు కనిపించింది. కానీ ఇప్పుడు కొత్త దర్శకుడు తీసిన ట్రైలర్‌లో మాత్రం పూర్తిగా ‘అర్జున్‌రెడ్డి’ యథాతథంగా కనిపిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top