పా.రంజిత్ నిర్మాణంలో అధర్వ | adharva movie under construction of pa.ranjit | Sakshi
Sakshi News home page

పా.రంజిత్ నిర్మాణంలో అధర్వ

Nov 15 2016 2:35 AM | Updated on Sep 4 2017 8:05 PM

పా.రంజిత్ నిర్మాణంలో అధర్వ

పా.రంజిత్ నిర్మాణంలో అధర్వ

యువ దర్శకుల్లో చాలా మంది నిర్మాతలుగా మారి తమ శిష్యులకు అవకాశాలను కల్పిస్తూ చిత్రాలను నిర్మిస్తున్నారు.

యువ దర్శకుల్లో చాలా మంది నిర్మాతలుగా మారి తమ శిష్యులకు అవకాశాలను కల్పిస్తూ చిత్రాలను నిర్మిస్తున్నారు. ఆ కోవలో కబాలి దర్శకుడు పా.రంజిత్ కూడా చేరనున్నారన్నది తాజా సమాచారం. మూడే మూడు చిత్రాలతో ప్రముఖ దర్శకుల పట్టికలో చోటు సంసాదించుకున్న పా.రంజిత్ తాజాగా మరోసారి సూపర్‌స్టార్ రజినీకాంత్ చిత్రానికి దర్శకత్వం చేయడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. కాగా మరో పక్క నీలం ప్రొడక్షన్‌‌స పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి వరుసగా చిత్రాలను నిర్మించ తలపెట్టారు. ముందుగా యువ నటుడు అధర్వ హీరోగా ఒక చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అరుునట్లు తెలిసింది.

ఇందుకు ఆయన ఓల్ట్ పీరియడ్ కథను తయారు చేశారట. 1973లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా సిద్ధం చేసుకున్న ఈ చిత్రానికి తన శిష్యుడొకరిని దర్శకుడిగా పరిచయం చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం ఇమైక్కా నోడిగళ్ చిత్రంలో నయనతారతో కలిసి నటిస్తున్న అధర్వ తదుపరి ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ తరువాతే పా.రంజిత్ చిత్రంలో నటించే అవకాశం ఉంటుందన్నది గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement