pa.ranjit
-
బాషాకు దీటుగా..
-
బాషాకు దీటుగా..
బాషా చిత్రం తమిళ సినిమాలో ఒక చరిత్ర. గ్యాంగ్‌స్టర్‌గా సూపర్‌స్టార్ నటనకు పరాకాష్టగా పేర్కొనవచ్చు. అప్పట్లో రికార్డులు తిరగరాసిన బాషా చిత్రాన్ని రీమేక్ చేయాలని ఆ చిత్ర దర్శకుడు సురేశ్‌కృష్ణ ప్రయత్నించినా రజనీకాంత్ నిరాకరించారు. అంతే కాదు బాషా ఒక్కడే అని ఆయన ఏకవాక్యం చేశారు కూడా. మరి బాషాకు దీటుగా మరో చిత్రం వచ్చేనా. వస్తుందంటున్నారు యువ దర్శకుడు పా.రంజిత్. ఈయన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల సూపర్‌స్టార్‌తో ఆయన తెరకెక్కించిన కబాలి చిత్రమే చాలా చెప్పేసింది. కాగా కబాలి చిత్ర టేకింగ్‌కు ముగ్ధుడైన సూపర్‌స్టార్ రంజిత్‌తో వెంటనే మరో చిత్రం చేయడానికి రెడీ అయ్యిపోయిన సంగతి తెలిసిందే. దీన్ని ఆయన అట్లుడు, నటుడు ధనుష్ తన సొంత సంస్థ వండర్‌బార్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కథను తయారు చేసిన రంజిత్ ఇది కబాలి తరహాలో కాకుండా బాషా పంథాలో ఉంటుందంటున్నారు. అయితే బాషా చిత్రాన్ని మించే విధంగా ఉండదుగాని దానికి దీటుగా ఉంటుందని పేర్కొన్నారు. ఇది కూడా గ్యాంగ్‌స్టర్ కథా చిత్రమేనని తెలిసింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో రజనీని మరో కొత్తకోణంలో ఆవిష్కరిస్తానంటున్నారు దర్శకుడు పా.రంజిత్. ఇందుకోసం లోకేషన్స్ ఎంపిక చేయడానికి రంజిత్ బృందం ప్రస్తుతం ముంబైలో మకాం వేసినట్లు సమాచారం. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 2.ఓ చిత్రంలో నటిస్తున్న రజనీకాంత్ తదిపరి పా.రంజిత్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. -
చిత్ర నిర్మాణరంగంలోకి కబాలి దర్శకుడు
దర్శకులు నిర్మాతలుగా మారడం అన్నది కొత్తేమీ కాదు. స్టార్ దర్శకుడు శంకర్ లాంటి వారు చిత్ర నిర్మాణం చేపట్టి విలువలతో కూడిన మంచి కథా చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇదే కోవలో అట్టకత్తి అంటూ దర్శకుడిగా పరిచయం అయిన పా.రంజిత్ తొలి చిత్రంతోనే చిత్రపరిశ్రమ వర్గాల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఆ తరువాత మద్రాస్ అంటూ ఉత్తర చెన్నై యువత జీవన విధానాన్ని సహజత్వంతో తెరపై ఆవిష్కరించి మరో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక మూడో చిత్రంతోనే సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను గ్యాంగ్‌స్టర్‌గా చూపించి కబాలి చిత్రంతో స్టార్ దర్శకుల పట్టికలో చేరారు. తాజాగా మళ్లీ రజనీకాంత్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అయిన పా.రంజిత్ ఆ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మరో పక్క నీలం ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి నవ దర్శకుడు మారి సెల్వరాజ్‌ను పరిచయం చేస్తూ చిత్రం నిర్మించడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రానికి పరియేరుం పెరిమాళ్ అనే పేరును నిర్ణయించారు. క్రిమి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న కధీర్ హీరోగానూ, నటి ఆనంది హీరోయిన్ గా నటించనున్నారు. ఈ నెల చివర్లో చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇది తిరునెల్వెలి పరిసర ప్రాంతానికి చెందిన ఒక యువకుడి ఇతివృత్తంగా ఉంటుందట. ప్రేమ, యాక్షన్ అంటూ అన్ని కమర్షియల్ అంశాలతో జనరంజకంగా చిత్రం ఉంటుందట. ఈ విషయాన్ని నూతన సంవత్సరం సందర్భంగా ప్రకటించారు. ఇక మారి సెల్వరాజ్ గురించి చెప్పాలంటే ఈయన దర్శకుడు రామ్ వద్ద కట్రదు తమిళ్, తంగమీన్ గళ్, తరమణి చిత్రాలకు సహాయదర్శకుడిగా పని చేశారు. పరియేరుం పెరుమాళ్ చిత్రానికి కథ, కథనం దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దీనికి సంతోష్ నారాయణ్ సంగీతం, శ్రీధర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
పా.రంజిత్ నిర్మాణంలో అధర్వ
యువ దర్శకుల్లో చాలా మంది నిర్మాతలుగా మారి తమ శిష్యులకు అవకాశాలను కల్పిస్తూ చిత్రాలను నిర్మిస్తున్నారు. ఆ కోవలో కబాలి దర్శకుడు పా.రంజిత్ కూడా చేరనున్నారన్నది తాజా సమాచారం. మూడే మూడు చిత్రాలతో ప్రముఖ దర్శకుల పట్టికలో చోటు సంసాదించుకున్న పా.రంజిత్ తాజాగా మరోసారి సూపర్‌స్టార్ రజినీకాంత్ చిత్రానికి దర్శకత్వం చేయడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. కాగా మరో పక్క నీలం ప్రొడక్షన్స పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి వరుసగా చిత్రాలను నిర్మించ తలపెట్టారు. ముందుగా యువ నటుడు అధర్వ హీరోగా ఒక చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అరుునట్లు తెలిసింది. ఇందుకు ఆయన ఓల్ట్ పీరియడ్ కథను తయారు చేశారట. 1973లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా సిద్ధం చేసుకున్న ఈ చిత్రానికి తన శిష్యుడొకరిని దర్శకుడిగా పరిచయం చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం ఇమైక్కా నోడిగళ్ చిత్రంలో నయనతారతో కలిసి నటిస్తున్న అధర్వ తదుపరి ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ తరువాతే పా.రంజిత్ చిత్రంలో నటించే అవకాశం ఉంటుందన్నది గమనార్హం.