చార్మీని పెళ్లాడడానికి రెడీ... | actress trisha accept to charmi marriage proposal | Sakshi
Sakshi News home page

చార్మీని పెళ్లాడడానికి రెడీ...

May 6 2017 4:05 PM | Updated on Sep 5 2017 10:34 AM

చార్మీని పెళ్లాడడానికి రెడీ...

చార్మీని పెళ్లాడడానికి రెడీ...

నటి చార్మీని పెళ్లాడడానికి త్రిష గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఏంటీ నమ్మబుద్ధికావడం లేదా?

నటి చార్మీని పెళ్లాడడానికి త్రిష గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఏంటీ నమ్మబుద్ధికా వడం లేదా? అయితే ఇది చదవండి. ప్రస్తుతం అమెరికాలో ఎంజాయ్‌ చేస్తున్న త్రిష గురువారం 33వ ఏటలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు పలువురు ట్విట్టర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అందులో నటి చార్మీ కూడా ఉంది. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు త్రిష. త్వరగా తిరిగి రా.. పార్టీ చేసుకుందాం. అలాగే నేను చేసిన పెళ్లి ప్రతిపాదనను ఈ ఏడాదైనా పరిగణనలోకి తీసుకో..’ అంటూ ట్విటర్‌లో చార్మీ ట్వీట్‌ చేసింది.

త్రిష స్పందిస్తూ ‘నన్ను పెళ్లి చేసుకోవాలన్న ఇష్టాన్ని వ్యక్తపరిచిన రోజే సమ్మతం తెలిపాను. లవ్‌ యూ’ అంటూ బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలు వారి మధ్య సాన్నిహిత్యాన్ని, స్నేహాన్ని గుర్తు చేస్తున్నా.. నెటిజన్లు తమదైన ప్రచారాలతో దుమ్ముదులుపుతున్నారు. కాగా పౌర్ణమి చిత్రంలో త్రిష, చార్మి కలిసిన నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరూ స్నేహితులుగా మారారు. త్రిష తన తల్లి ఉమాకృష్ణన్‌ తో కలిసి సమ్మర్‌ వెకేషన్‌కు వెళ్లింది. అక్కడే తన పుట్టినరోజును స్నేహితుల సమక్షంలో జరుపుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement