రోడ్డుప్రమాదం.. నటి తల్లికి గాయాలు | Actress Sindhu Menon mother injured in a accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదం.. నటి తల్లికి గాయాలు

Sep 29 2017 9:40 AM | Updated on Sep 29 2017 12:16 PM

Actress Sindhu Menon mother injured in a accident

సాక్షి, బెంగళూరు: దక్షిణాది నటి సింధుమీనన్‌ తల్లి శ్రీదేవి గురువారం రోడ్డుప్రమాదానికి గురయ్యారు. స్వల్పంగా గాయపడ్డ శ్రీదేవి స్థానిక రామయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ వివరాలిలా.. సింధుమీనన్ తల్లి శ్రీదేవి తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు బెంగళూరులోని మత్తికెరె సర్కిల్‌ వద్ద ఆటో ఎక్కారు. ఇంతలో ఒక క్యాబ్‌ వేగంగా వచ్చి ఆటోను వెనుకవైపు నుంచి ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న శ్రీదేవి కి గాయాలయ్యాయి.

బాధతో విలవిల లాడుతున్న శ్రీదేవిని ఆసుపత్రికి తీసుకెళ్లడం ఆపేసి క్యాబ్, ఆటో డ్రైవర్లు ఇద్దరు గొడవకు దిగారు. చుట్టూ ఉన్న వారు కూడా బాధితురాలికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఇంతలో బాధితురాలు, సింధుమీనన్ తల్లి శ్రీదేవి ఫోన్‌చేసి కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న శ్రీదేవి కుమారుడు మనోజ్‌ ఆమెను స్థానిక రామయ్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమెకు ఛాతి భాగంలో బలమైన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement