పెళ్లిపీటలెక్కుతున్న హీరోయిన్‌ నమిత | Actress Namitha to marry her boyfriend on Nov 24th | Sakshi
Sakshi News home page

ఈ నెల 24 సినీ నటి నమిత పెళ్లి !

Nov 10 2017 1:43 PM | Updated on Apr 3 2019 9:12 PM

 Actress Namitha to marry her boyfriend on Nov 24th - Sakshi

సాక్షి, చెన్నై: మరో సినీజంట పెళ్లిపీటలెక్కబోతున్నారు. తాజాగా  ప్రముఖ నటి నమిత పెళ్లి విషయంలో వస్తున్న రూమర్లకు చెక్‌ పెట్టారు. ‘మియా’ చిత్రంలో తనతో నటించిన వీరేంద్ర చౌదరి అలియాస్‌ వీరును ఈ నెల 24న వివాహం చేసుకోబోతున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ పెళ్లిపై వీరిద్దరూ స్పష్టతను ఇస్తూ అభిమానుల ఆశీర్వాదాలను కోరుతూ.. ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. కాగా వీరిద్దరి వివాహానికి ఇరు కుటుంబాలు ఆమోదం తెలిపినట్లు సమాచారం. తిరుమలలో వీరిద్దరి వివాహం జరగనుంది. 

నమిత 2002లో ఆర్యన్‌ రాజేశ్‌ హీరోగా తెరకెక్కిన ‘సొంతం’ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఆ తర్వాత వెంకటేష్‌ హీరోగా నటించిన జెమినీ చిత్రంలో నటించింది. తెలుగులో తగినన్ని అవకాశాలు రాకపోవడంతో నమిత ఆ తర్వాత కోలీవుడ్‌పై దృష్టి సారించి, అక్కడ టాప్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. కాగా కొద్ది రోజుల క్రితం సీనియర్‌ నటుడు శరత్‌ బాబును నమిత వివాహమాడనుందనే వార్త కూడా చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement