కేసును ఉపసంహరించుకున్న నటి అపూర్వ! | Actress aproova withdraws case | Sakshi
Sakshi News home page

కేసును ఉపసంహరించుకున్న నటి అపూర్వ!

May 24 2016 10:20 PM | Updated on Apr 3 2019 9:04 PM

కేసును ఉపసంహరించుకున్న నటి అపూర్వ! - Sakshi

కేసును ఉపసంహరించుకున్న నటి అపూర్వ!

సినీనటి అపూర్వ తనను బెదిరించిన వ్యక్తులపై పెట్టిన కేసును ఉపసంహరించుకున్నట్టు తెలిసింది.

హైదరాబాద్‌: సినీనటి అపూర్వ తనను బెదిరించిన వ్యక్తులపై పెట్టిన కేసును ఉపసంహరించుకున్నట్టు తెలిసింది. తనకు ప్రాణ భయముందని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇన్‌స్పెక్టర్‌ వహిదుద్దీన్‌ తెలిపిన మేరకు.. సిద్ధార్థనగర్‌లో నివాసముంటున్న అపూర్వ కారును ఈ నెల 21న ఫిలింసిటీ సమీపంలోని చౌటుప్పల్‌ వద్ద మరో కారు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో అపూర్వ కారు పూర్తిగా దెబ్బతినింది.

దీంతో మరమ్మతులు చేయించడానికి ఢీకొట్టిన వారు ఒప్పుకున్నారు. అంతేకాకుండా కారు రిపేరు పూర్తయ్యే వరకు వారి కారును కూడా అపూర్వ వద్దే ఉంచారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల తనకు బెదిరింపు ఫోన్‌కాల్స్‌తోపాటు  నివాసముంటున్న సిద్ధార్థనగర్‌లోని తన ఇంటి వద్ద పలువురు వ్యక్తులు తచ్చాడుతున్నారని ఆమె పోలీసులకు సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement