'నా పెళ్లి వార్తల్లో నిజంలేదు' | actress Anjali condems rumours on her marriage | Sakshi
Sakshi News home page

'నా పెళ్లి వార్తల్లో నిజంలేదు'

Aug 31 2013 10:55 AM | Updated on Sep 1 2017 10:19 PM

'నా పెళ్లి వార్తల్లో నిజంలేదు'

'నా పెళ్లి వార్తల్లో నిజంలేదు'

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు' సినిమాతో క్రేజ్ ను అమాంత పెంచుకున్న నటి అంజలి తనపై వచ్చిన పెళ్లి వార్తలను ఖండించింది.

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు' సినిమాతో క్రేజ్ ను అమాంత పెంచుకున్న నటి అంజలి తనపై వచ్చిన పెళ్లి వార్తలను ఖండించింది. ఈ మధ్య అంజలి అదృశ్యం ఉదంతం వెనుక పెళ్లి జరిగిందనే వార్తలు బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. కాగా ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని ఆమె మీడియాకు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో పేర్కొంది.  'నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి సమయం వస్తే దాయాల్సిన అవసరం దేనికని' నటి అంజలి  మండిపడింది. పెళ్లి వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని,  తనపై ఇటువంటి పుకార్లు రావడం బాధ కల్గించదని పేర్కొంది.

 

తన పెళ్లి వార్తను ఓ న్యూస్ పేపర్ లో చదివి షాకయ్యానని, ప్రస్తుతం షూటింగ్ లలో బిజీగా ఉన్నందున సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించానని ఆ లేఖలో పేర్కొంది. కాగా, తనకు ఇప్పటివరకూ సపోర్ట్ గా నిలిచిన మీడియాకు కృతజ్ఞతలు తెలిపింది. తాను ప్రస్తుతం ఈ స్టేజ్ లో ఉండటానికి మీడియా కూడా ఓ కారణమేనని పేర్కొంది.
 

 

 ఓ తమిళ నిర్మాత మరియు అంజలి తల్లి తనను వేదిస్తున్నారంటూ కంప్లైంట్ చేసిన తర్వాత ఆమె కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక ఐదు రోజుల తర్వాత అంజలి తనంతట తానె తిరిగి వచ్చేసింది. అప్పుడు కూడా వేదింపులు భరించలేక అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు చెప్పినది. ఇదిలా ఉంటె ఆ నిర్మాత అంజలిపై తన పరువు ప్రతిష్ట లు దెబ్బతిన్నాయంటూ కేసు పెట్టాడు. అంతే కాకా తమిళ ఫిల్మ్ చాంబర్ లో కూడా ఆమెపై ఫిర్యాదు చేశాడు. తన సినిమాలో నటించడానికి అంగీకరించి ఇప్పుడు డేట్స్ ఇవ్వడం లేదని తెలిపాడు. ఇవన్ని ఇలా ఉంటె అంజలి ఓ తెలుగు నిర్మాతను వివాహం చేసుకుందనే వార్తలు ఈ మధ్య గుప్పుమన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement