పెద్ద మనసు చాటుకున్న విశాల్‌ | Actor Vishal Distribute Ration To Nadigar Sangam Members | Sakshi
Sakshi News home page

పెద్ద మనసు చాటుకున్న విశాల్‌

Apr 13 2020 8:36 AM | Updated on Apr 13 2020 8:36 AM

Actor Vishal Distribute Ration To Nadigar Sangam Members - Sakshi

నడిగర్‌ సంఘం సభ్యులకు సాయం అందిస్తున్న విశాల్‌ ప్రతినిధులు 

తమిళ సినిమా : కరోనా దెబ్బకు దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్‌ సంఘం) సభ్యులు ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్నారు. సంఘానికి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక ప్రతినిధి ఆదుకోవాలని సినీ ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు. కొందరు నడిగర్‌ సంఘం సభ్యులకు తమ వంతు సాయం అందిస్తున్నారు. సభ్యులను ఆదుకునేందుకు విశాల్‌ ఆదివారం ముందుకు వచ్చారు. 150 మంది సభ్యులకు నెలకు సరిపడే నిత్యావసర వస్తువులను అందించారు. సహాయ కార్యక్రమంలో నటుడు శ్రీమాన్, దళపతి దినేష్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇతర ఊర్లలో ఉన్న సభ్యులకు ఈ సాయం అందే ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా 300 మంది హిజ్రాలకు నిత్యావసర వస్తువులను అందించారు. అదేవిధంగా కరోనా నివారణకు సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 1,000 మాస్క్‌లు, 1,000 శానిటైజర్లు అందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement