సీఎం ఇంటికి 'మళ్లీరావా' | Actor Sumanth gets request from CM's residence for print of 'Malli Raava' | Sakshi
Sakshi News home page

సీఎం ఇంటికి 'మళ్లీరావా'

Dec 9 2017 12:45 PM | Updated on Aug 15 2018 9:40 PM

 Actor Sumanth gets request from CM's residence for print of 'Malli Raava' - Sakshi

చాలా గ్యాప్‌ తర్వాత హీరో సుమంత్‌ చేసిన సినిమా 'మళ్లీరావా'. కొత్త దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ శుక్రవారం ప్రేక్షకుల ముందకు వచ్చి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో సినిమా సక్సెస్‌ను ఎంజాయి చేస్తున్నాడు సుమంత్‌. ఈ నేపథ్యంలో వచ్చిన ఓ సందేశం ఆయన సంతోషాన్ని రెట్టింపు చేసింది. ఆ సందేశమేమిటంటే మళ్లీరావా సినిమా చూడాలని, ఓ ప్రింట్‌ కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంటి నుంచి మేసేజ్‌ వచ్చిందట. ఈ విషయాన్ని సుమంత్‌ ట్వీట్‌ చేశారు. మా సినిమాను చూడలనుకోవడం చాలా సంతోషంగా ఉందని, ప్రింట్‌ పంపిస్తున్నట్టు ఆయన ట్విట్టర్‌లో తెలిపారు.

కాగా, రాహుల్ యాదవ్ నక్క నిర్మించిన ఈ మూవీలో హిందీ టీవీ ఆర్టిస్ట్‌ ఆకాంక్ష సింగ్‌ హీరోయిన్‌గా నటించింది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. మిర్చి కిరణ్, మాస్టర్ సాత్విక్, బేబి ప్రీతి ఆస్రాని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. 

Advertisement
 
Advertisement
Advertisement