సెట్‌లో చెత్త ఎత్తిన సీనియర్‌ యాక్టర్‌ | Actor Nassar Cleaned Shooting Premises Viral | Sakshi
Sakshi News home page

Jul 3 2018 12:05 PM | Updated on Aug 15 2018 9:48 PM

Actor Nassar Cleaned Shooting Premises Viral - Sakshi

సినిమాల్లో తెరపై నీతులు చెప్పే స్టార్లు.. రియల్‌ లైఫ్‌లో అది పాటించటం చాలా అరుదు. అయితే విలక్షణ నటుడు నాజర్‌ మాత్రం అలా కాదు. స్వయంగా తానే సెట్‌లో చెత్త ఎత్తి చూపించారు. పంచె ఎగ్గట్టి స్పాట్‌లో టీ కప్పులు, చెత్త కవర్‌లను ఏరి డస్ట్‌ బిన్‌లో పడేశారు. చుట్టుపక్కల ఉన్నవాళ్లు అది పట్టించుకోకపోయినా.. ఓ వ్యక్తి మాత్రం ఆ ఘటనను తన మొబైల్‌లో షూట్‌ చేశారు. బ్యాక్‌ గ్రౌండ్‌లో ఓ వ్యక్తి తెలుగు మాట్లాడటం గమనించొచ్చు. ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? వీడియో పాతదా? కొత్తదా? స్పష్టతలేదుగానీ ప్రస్తుతం వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. సీనియర్‌ నటుడు, పైగా నడిగర్‌ సంఘం ప్రెసిడెంట్‌ స్థాయిలో ఉండి కూడా ఆయన అలా చేయటంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బయోపిక్‌ ఉద్యమ సింహం లో నాజర్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. కల్వకుంట్ల నాగేశ్వర్‌రావు నిర్మిస్తున్న ఈ సినిమాకు అల్లూరి కృష్ణంరాజు దర్శకుడు.

Advertisement
 
Advertisement
Advertisement