మే 29న నటుడు నరేష్ పెళ్లి | actor naresh ready to wedlock with virupa | Sakshi
Sakshi News home page

మే 29న నటుడు నరేష్ పెళ్లి

May 1 2015 8:33 PM | Updated on Aug 17 2018 2:34 PM

మే 29న నటుడు నరేష్ పెళ్లి - Sakshi

మే 29న నటుడు నరేష్ పెళ్లి

దివంగత ఈవీవీ సత్యనారాయణ కుమారుడు, సినీ హీరో 'అల్లరి' నరేష్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు.

చెన్నై: దివంగత ఈవీవీ సత్యనారాయణ కుమారుడు,  సినీ హీరో 'అల్లరి' నరేష్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. ఈ మేరకు శుక్రవారం చెన్నైలోని లీలా ప్యాలెస్ లో నిశ్చయ తాంబూల వేడుక జరిగింది. ఈదర వీర వెంకట సత్యనారాయణ( స్వర్గీయ), సరస్వతి దంపతుల ద్వితీయ పుత్రుడు అయిన నరేష్ కు రామకృష్ణ కంఠమనేని, రమ దంపతుల పుత్రిక విరూపతో వివాహం నిశ్చయించారు.

మే 29న రాత్రి 9 గంటల 3 నిమిషాలకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ జంట పెళ్లి ముడితో ఒక్కటి కానున్నారు. వీరి వివాహానికి బంధువులు సపరివార సమేతంగా వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని అన్నయ్య ఈదర రాజేశ్ విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement