మణిరత్నం దర్శకత్వంలో మాధవన్‌? | Actor Madhavan is directing Mani Ratnam | Sakshi
Sakshi News home page

మణిరత్నం దర్శకత్వంలో మాధవన్‌?

Jul 25 2017 1:35 AM | Updated on Sep 5 2017 4:47 PM

మణిరత్నం దర్శకత్వంలో మాధవన్‌?

మణిరత్నం దర్శకత్వంలో మాధవన్‌?

మణిరత్నం దర్శకత్వంలో నటుడు మాధవన్‌ నటించనున్నారా? ఈ ప్రశ్నకు అలాంటి అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల నుంచి సమాధానం వస్తోంది.

తమిళసినిమా: మణిరత్నం దర్శకత్వంలో నటుడు మాధవన్‌ నటించనున్నారా? ఈ ప్రశ్నకు అలాంటి అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల నుంచి సమాధానం వస్తోంది. మణిరత్నం, మాధవన్‌లది హిట్‌ కాంబినేషన్‌ అని చెప్పవచ్చు. ఇంతకు ముందు  వీరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులకు అనుభూతిని కలిగించాయి. మణిరత్నం దర్శకత్వం వహించనున్న ఈ ద్విభాషా చిత్రంలో టాలీవుడ్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ, మాలీవుడ్‌ నటుడు ఫాహిద్‌ ఫాజిల్‌ కలిసి నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. 

ఈ చిత్రం సెప్టెంబర్‌ లో సెట్‌ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితిలో మాధవన్‌ను తన చిత్రంలో నటింపజేసే ప్రయత్నంలో మణిరత్నం ఉన్నట్లు  సమాచారం. మణిరత్నం తన తాజా చిత్రంలో మాధవన్‌ను  నటింపజేయాలనుకుంటున్నారా, ఆ తరువాత చిత్రం గురించి చర్చలు జరుపుతున్నారా అన్నది తెలియాల్సి ఉంది.  విక్రమ్‌ వేదా చిత్రంలో పోలీస్‌ అధికారిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న మాధవన్‌ ప్రస్తుతం ఒక తమిళ  హిందీ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement