
నటుడు బెనర్జీ తండ్రి, సీనియర్ నటుడు రాఘవయ్య (ఫైల్ ఫొటో)
నటుడు బెనర్జీ తండ్రి, సీనియర్ నటుడు రాఘవయ్య (86) తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్ లాంటి సీనియర్ నటులతో కలిసి పనిచేసిన రాఘవయ్య వీరాంజనేయ, కథానాయకుడు, యమగోల వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరగా మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను చిత్రంలో ఆయన నటించారు. రాఘవయ్య మృతి పట్ల పలువురు సినీ ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన భౌతిక కాయాన్ని అభిమానుల సందర‍్శనార్థం వారి స్వగృహంలో ఉంచారు. ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం మూడు గంటలకు ఫిలిం నగర్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.