'నాకేం కాలేదు.. క్షేమంగా ఉన్నా..'

Actor Adhi Pinisetty Responds on His Accident Rumours - Sakshi

కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి రోడ్డు ప్రమాదానికి గురయ్యారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలింది. తనకి ప్రమాదం జరిగినట్టు వార్తలు వస్తున్నాయని .. అవి ఎంత మాత్రం నిజం కావని, తాను క్షేమంగా ఉన్నట్టు ఆది ట్విటర్‌ ద్వారా తెలిపారు. ఆది రోడ్డు ప్ర‌మాదంలో గాయపడ్డారని, ఆయ‌న కండిష‌న్ సీరియ‌స్‌గా ఉంద‌ని  గత రెండు రోజులుగా వార్తలు వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆది స్పందించాడు.

‘నాకు యాక్సిడెంట్‌ జరిగి.. సీరియస్‌ కండిషన్‌ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో నిజం లేదు. నేను క్షేమంగా ఉన్నాను. నా తర్వాతి చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నాను. నాపై ఇంత ప్రేమ చూపించిన అభిమానులకు ధన్యవాదాలు. లవ్‌ ఆల్‌’  అని ఆది ట్వీట్‌లో తెలిపారు. మరో వైపు ‘భాగమతి’ సినిమాలో  ఆది నటిస్తున్నట్లు వచ్చిన వదంతులను ఆయన ఖండించారు. భాగమతి సినిమాలో తాను నటించడం లేదని స్పష్టం చేశారు.  ఆ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కాగా  అజ్ఞాతవాసి  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది ప్రస్తుతం రామ్‌ చరణ్‌ ‘రంగస్థలం’ సినిమాలో నటిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top