బెస్ట్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి... | ABCD Movie Success Meet | Sakshi
Sakshi News home page

బెస్ట్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి...

May 19 2019 5:51 AM | Updated on May 19 2019 5:51 AM

ABCD Movie Success Meet - Sakshi

రాజా, అల్లు శిరీష్, మధుర శ్రీధర్, సంజీవ్‌ రెడ్డి, ధీరజ్‌

అల్లు శిరీష్‌ హీరోగా డి.సురేష్‌ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్‌ బెన్‌  సినిమాస్‌ పతాకాలపై రూపొందిన చిత్రం ‘ఏబీసీడీ’. ‘అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి’ ట్యాగ్‌లైన్‌. సంజీవ్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాను ‘మధుర’ శ్రీధర్, యష్‌ రంగినేని నిర్మించారు. మే 17న చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో ‘మధుర’ శ్రీధర్‌ మాట్లాడుతూ– ‘‘తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్‌ ని కరెక్ట్‌గా చేయాలి. ప్రేక్షకులందరికీ నచ్చేలా తీయాలని మేం సినిమా ఆరంభించే ముందు అనుకున్నాం. అది నెరవేరింది. శిరీష్‌ ఫెంటాస్టిక్‌గా నటించాడు. శిరీష్‌లో హ్యాపీనెస్‌ చూడాలనుకున్నాను. అది కూడా ఈ రోజు నెరవేరింది. హీరో, హీరోయిన్‌ మధ్య లవ్‌ స్టోరీ, భరత్, వెన్నెల కిశోర్‌ల కామెడీ హైలైట్‌ అయ్యాయని అంటున్నారు.

శిరీష్‌ నటించిన బెస్ట్‌ మూవీ ‘శ్రీరస్తు– శుభమస్తు’ని మించి మా సినిమా వసూళ్లు ఉండాలన్నది మా ఆశ. వీకెండ్‌కే ఆ ఫీట్‌ని సాధిస్తాం’’ అన్నారు. సంజీవ్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘మేమందరం సినిమాలో ఎక్కడెక్కడ మంచి స్పందన వస్తుందని అనుకున్నామో, అక్కడే ప్రేక్షకుల నుండి సూపర్బ్‌ రెస్పా¯Œ ్స రావటం ఆనందంగా ఉంది. శిరీష్‌గారి యాక్టింగ్‌కి మంచి పేరు వచ్చింది’’ అన్నారు. అల్లు శిరీష్‌ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్‌ బెస్ట్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి. ఈ రోల్‌ చేస్తున్నప్పుడు పర్సనల్‌గా బాగా కనెక్ట్‌ అయ్యాను. ఆర్టిస్ట్‌గా ఎదిగిన ఫీలింగ్‌ ఉంది. ఈ సినిమాకు వచ్చినంత రెస్పాన్స్‌ గతంలో నేను చేసిన ఏ సినిమాకూ రాలేదు. నాకు ఇంత పేరు వచ్చిందంటే ఆ క్రెడిట్‌ అంతా డైరెక్టర్‌ సంజీవ్‌దే’’ అన్నారు. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ ధీరజ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement