ఆటాడుకున్నారు | Aatagallu Movie Trailer Released | Sakshi
Sakshi News home page

ఆటాడుకున్నారు

Jul 1 2018 1:30 AM | Updated on Aug 29 2018 3:53 PM

Aatagallu Movie Trailer Released  - Sakshi

నారా రోహిత్, పరుచూరి మురళి, జగపతిబాబు, వాసిరెడ్డి రవీంద్రనాథ్‌

‘‘థ్రిల్లర్, మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఆటగాళ్ళు’. ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తుంది. పరుచూరి మురళి ట్రైలర్‌ను అద్భుతంగా కట్‌ చేశాడు. మురళి స్నేహితుడు కావడంతో నిర్మాతలు కాంప్రమైజ్‌ కాకుండా ఈ సినిమా గ్రాండ్‌గా నిర్మించారు’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. నారా రోహిత్, జగపతిబాబు, బ్రహ్మానందం, దర్శనా బానిక్‌ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ఆటగాళ్ళు’. పరుచూరి మురళి దర్శకత్వంలో వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు శేఖర్‌ కమ్ముల విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన  వాసిరెడ్డి రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ– ‘‘సినిమా మైండ్‌ గేమ్‌తో ఆసక్తికరంగా ఉంటుంది. నటన, డైలాగ్స్‌ పరంగా జగపతిబాబుగారు, నారా రోహిత్‌గారు ఆటాడుకున్నారు. సినిమా బాగా వచ్చింది. జగపతిబాబుగారు తొలిసారి లాయర్‌ పాత్రలో నటించారు’’ అన్నారు. ‘‘మర్డర్‌ మిస్టరీ మూవీ ఇది. ఇలాంటి జానర్‌లో సినిమా చేయడం నాకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చింది’’ అన్నారు నారా రోహిత్‌. ‘‘ఈ సినిమాను ప్రేక్షకులకు రీచ్‌ చేయిస్తే చాలు. ఎందుకంటే థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుడికి తప్పకుండా సినిమా నచ్చుతుంది. నా స్నేహితులే నిర్మాతలు కావడంతో నన్ను భరించి సినిమా పూర్తి చేశారు’’ అన్నారు పరుచూరి మురళి. నటులు శ్రీతేజ్, ఫణి, రైటర్‌ గోపీ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement