జీవితంతో ఆట | Aatagallu Movie Release in July 5 | Sakshi
Sakshi News home page

జీవితంతో ఆట

Jun 2 2018 2:17 AM | Updated on Aug 29 2018 3:53 PM

Aatagallu Movie Release in July 5 - Sakshi

నారా రోహిత్

నారా రోహిత్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఆటగాళ్ళు’. ‘గేమ్‌ విత్‌ లైఫ్‌’ అన్నది ట్యాగ్‌లైన్‌. పరుచూరి మురళి దర్శకత్వంలో ఫ్రెండ్స్‌ మూవీ క్రియేషన్స్‌ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర నిర్మించారు. బ్రహ్మానందం ముఖ్య పాత్రలో కనిపించనున్న ఈ సినిమాతో దర్శనా బానిక్‌ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని జూలై 5న విడుదల చేయనున్నారు.

ఈ  సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఇంటెలిజెంట్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. నారా రోహిత్, జగపతిబాబు పాత్రలు ఈ సినిమాకు ప్రధాన బలం. బ్రహ్మానందంగారి కామెడీ హైలైట్‌. మురళి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సాయి కార్తీక్‌ సంగీతం, విజయ్‌ సి. కుమార్‌ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణలు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. మా సినిమా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement