వెండితెరకు వైరస్‌ | Aashiq Abu announces Virus | Sakshi
Sakshi News home page

వెండితెరకు వైరస్‌

Sep 10 2018 1:54 AM | Updated on Sep 10 2018 1:54 AM

Aashiq Abu announces Virus - Sakshi

పార్వతీ

ఈ సంవత్సరం స్టార్టింగ్‌లో నిఫా వైరస్‌ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కేరళ రాష్ట్రాన్ని. అందర్నీ గడగడలాడించిన ఈ భయంకరమైన వైరస్‌ని బేస్‌ చేసుకొని మలయాళ దర్శకుడు ఆషిక్‌ అబు ఓ చిత్రాన్ని రూపొందించడానికి రెడీ అయ్యారు. ‘వైరస్‌’ పేరుతో తెరకెక్కబోయే ఈ రియలిస్టిక్‌ డ్రామాలో భారీ తారాగణం కనిపించబోతున్నారు.

రేవతి, రీమా కళ్లింగల్, పార్వతీ, టావినో థామస్, రమ్యా నంబీసన్, చెంబు వినోద్‌ వంటి నటీనటులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆల్రెడీ మలయాళంలో రియలిస్టిక్‌ సంఘటనలతో తెరకెక్కించిన ‘టేకాఫ్‌’ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. మరి.. ఈ సినిమా ఎలా ఉండబోతోందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి రిలీజ్‌ కానున్న ఈ చిత్రం షూటింగ్‌ వచ్చే నెలలో స్టార్ట్‌ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement