అందుకే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ | aamir khan new look for dangal | Sakshi
Sakshi News home page

అందుకే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్

Jun 14 2016 11:32 AM | Updated on Sep 4 2017 2:28 AM

అందుకే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్

అందుకే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్

పికె లాంటి భారీ హిట్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, ప్రస్తుతం దంగల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ప్రజెంట్ బాలీవుడ్లో బయోపిక్...

పికె లాంటి భారీ హిట్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, ప్రస్తుతం దంగల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ప్రజెంట్ బాలీవుడ్లో బయోపిక్ సినిమాల సీజన్ నడుస్తుండటంతో అదే జానర్లో ప్రముఖ రెజ్లర్ మహావీర్ ఫోగట్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మామూలు కథల విషయంలోనే ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ఆమిర్, నిజజీవిత కథ కావటంతో దంగల్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.

ఈ సినిమాలో రెండు డిఫరెంట్ లుక్స్లో కనిపించనున్న ఆమిర్., ఆ లుక్స్ కోసం భారీ కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే వయసయిన రెజ్లర్లా కనిపించటం కోసం 22 రెండు కేజీల బరువు పెరిగి షూటింగ్లో పాల్గొన్నాడు. ఈ సన్నివేశాల్లో ఇద్దరు పిల్లలకు తండ్రిగా కనిపించనున్నాడు ఆమిర్. ఇక యంగ్ ఏజ్లో ఉన్న మహావీర్ పొగట్టకు సంబందించిన సన్నివేశాల చిత్రీకరణ కోసం తనను తాను ఓ యోధుడిగా మలుచుకుంటున్నాడు. షూటింగ్ కు రెండు రోజుల ముందు తను ఎలా ఉన్నాడో చూపిస్తూ ఓ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు ఆమిర్. కేవలం 25 వారాల్లో 25 కిలోల బరువు తగ్గి కండల తిరిగిన దేహంతో కనిపిస్తున్నాడు. సినిమా కోసం ఇంత రిస్క్ చేస్తున్న ఆమిర్పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement