నా ఇష్టం శ్రీదేవికి తెలియకూడదనుకున్నా!

Aamir Khan never looked into the eyes of Sridevi - Sakshi

బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్‌ ఎంత పెద్ద స్టారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారాయన. ‘లగాన్, పీకే, దంగల్‌’ వంటి సినిమాలతో సినీ ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’ మూవీ ప్రమోషన్లో పాల్గొన్న ఆమీర్‌ ముందు ‘మీకు ఇçష్టమైన నటీనటులు ఎవరు?’ అన్న ప్రశ్న ఉంచితే– ‘‘అమితాబ్‌ బచ్చన్‌గారంటే ఇష్టం’’ అని టకీమని చెప్పారు. ఆ తర్వాత ఒక్క క్షణం ఆగి.. ‘‘నటి శ్రీదేవికి నేను పెద్ద ఫ్యాన్‌ని. నా కెరీర్‌ మొదట్లోనే ఆమె అంటే ఇష్టం మొదలైంది. ఓ మ్యాగజీన్‌ ఫొటోషూట్‌ కోసం శ్రీదేవిని కలిశాను.

అప్పుడు ఆమె కళ్లలోకి నా కళ్లు పెట్టి చూస్తే నా మనసులో ఉన్న ఇష్టం ఆమెకు ఎక్కడ తెలిసిపోతుందోనని వీలైనంత వరకూ నా చూపులను పక్కకు తిప్పుకునేలా ప్రయత్నించాను. ఆమెతో కలిసి ఇంగ్లీష్‌ మూవీ ‘రోమన్‌ హాలీడే’ హిందీ రీమేక్‌లో నటించాలనుకున్నా. ఈ ఆలోచన గురించి దర్శకుడు మహేశ్‌భట్‌తో చర్చించాను కూడా’’ అని నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు ఆమిర్‌. ఇదిలా ఉంటే.. విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఆమిర్‌ఖాన్, అమితాబ్‌ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్‌ ముఖ్య తారలుగా నటించిన ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన ఫలితాలను రాబట్టడంలో విఫలమైందని బాలీవుడ్‌ టాక్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top