మే 24న ‘బుర్రకథ’

Aadi Sai Kumar Burrakatha Movie Release Date - Sakshi

ఆది సాయికుమార్ హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘బుర్ర క‌థ’. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. డిఫ‌రెంట్ షేడ్స్‌తో స‌రికొత్త హెయిర్ స్టైల్‌తో ఆది ఆక‌ట్టుకుంటున్నాడు. ర‌చ‌యిత డైమండ్ ర‌త్నబాబు ఈ చిత్రంతో ద‌ర్శకుడిగా మారారు. దీపాల ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై హెచ్‌.కె.శ్రీకాంత్ దీపాల ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఒక మ‌నిషికి రెండు మెద‌ళ్లు ఉంటే ఎలా ఉంటుంద‌నే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన కామెడీ ఎంట‌ర్‌టైనరే  బుర్ర క‌థ‌. క‌థానుగుణంగానే ఫ‌స్ట్ లుక్‌ను రెండు షేడ్స్‌లో ఉండేలా డిజైన్ చేసి విడుద‌ల చేశారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు శ‌రవేగంగా జ‌రుగుతున్నాయి. మిస్తీ చ‌క్రవ‌ర్తి, నైరా షా హీరోయిన్స్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాను మే 24న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top