పవన్ కళ్యాణ్కు సరైనోడు | Aadi Pinisetty as Villain in Pawan Kalyan, Trivikram srinivasFilm | Sakshi
Sakshi News home page

పవన్ కళ్యాణ్కు సరైనోడు

Mar 28 2017 2:26 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ కళ్యాణ్కు సరైనోడు - Sakshi

పవన్ కళ్యాణ్కు సరైనోడు

కాటమరాయుడు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఏ మాత్రం గ్యాప్ లేకుండా మరో

కాటమరాయుడు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఏ మాత్రం గ్యాప్ లేకుండా మరో సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కబోయే సినిమా లాంచనంగా ప్రారంభించగా.. ఏప్రిల్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించనున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా.., పవన్ సినీ కెరీర్తో పాటు రాజకీయ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని తెరకెక్కిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాకు కథా కథనాలను సిద్ధం చేసిన త్రివిక్రమ్, ప్రస్తుతం నటీనటుల ఎంపిక మీద దృష్టి పెట్టాడు. ఈ సినిమాలో పవన్కు ప్రతినాయకుడిగా తమిళ నటుడు ఆదిని తీసుకునే ఆలోచనలో ఉన్నాడట త్రివిక్రమ్. తెలుగులో డబ్బింగ్ సినిమాలతో సుపరిచితుడైన ఆది, పలు స్ట్రయిట్ తెలుగు సినిమాల్లోనూ నటించాడు. ముఖ్యంగా సరైనోడు సినిమాలో ఆది చేసిన విలన్ పాత్ర హీరోతో సమానంగా గుర్తింపు తెచ్చుకుంది. అందుకే పవన్కు విలన్గా ఆదినే సరైనోడని ఫిక్స్ అయ్యారట. త్వరలోనే పవన్, త్రివిక్రమ్ల సినిమాలకు సంబంధించిన మరిన్ని విశేషాలను చిత్రయూనిట్ వెల్లడించనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement