ఒక్కరా.. ఇద్దరా? | 7 Telugu Movie Theatrical Trailer | Sakshi
Sakshi News home page

ఒక్కరా.. ఇద్దరా?

May 12 2019 1:50 AM | Updated on May 12 2019 1:50 AM

7 Telugu Movie Theatrical Trailer - Sakshi

హవీశ్, అనీశా ఆంబ్రోస్‌

ఆ అబ్బాయి పేరు కార్తీక్‌. ప్రేమ, పెళ్లి పేరుతో యువతులను మోసం చేశాడని అతడిపై కేసు నమోదు అవుతుంది. పోలీసులు కార్తీక్‌ కోసం గాలింపు చర్యలు చేపడతారు. అతడు కార్తీక్‌ కాదని, కృష్ణమూర్తి అని ఓ వ్యక్తి చెబుతాడు. అమ్మాయిలను మోసం చేసింది ఎవరు? కార్తీకా? కృష్ణమూర్తా? వంటి సస్పెన్స్‌ అంశాలతో రూపొందిన చిత్రం ‘సెవెన్‌’. హవీష్‌ కథానాయకుడిగా నిజార్‌ షఫీ దర్శకత్వంలో తెరకెక్కింది. రెజీనా, నందితా శ్వేత, అనీష్‌ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలుగా నటించారు. కిరణ్‌ స్టూడియోస్‌ పతాకంపై రమేష్‌ వర్మ నిర్మించిన ఈ సినిమా జూన్‌ 5న విడుదలకానుంది.

శుభం విశ్వనాధ్‌ సాహిత్యం అందించిన ‘సంపొద్దోయ్‌ నన్నే..., పులగం చిన్నారాయణ సాహిత్యం అందించిన ‘ఇదివరకెపుడు తెలియదు...’ పాటలను ఇప్పటికే రిలీజ్‌ చేయగా, తాజాగా సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. రమేష్‌ వర్మ మాట్లాడుతూ–‘‘ఇదొక రొమాంటిక్‌ థ్రిల్లర్‌ డ్రామా ఫిల్మ్‌.  కథ నేనే అందించాను. అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ మా సినిమాని విడుదల చేస్తోంది’’ అన్నారు. ‘‘ట్రైలర్‌లా సినిమా కూడా కొత్తగా ఉంటుంది’’ అని హవీష్‌ అన్నారు.  ఈ చిత్రానికి సంగీతం: చైతన్‌ భరద్వాజ్, సహనిర్మాత: కిరణ్‌ కె. తలశిల (న్యూయార్క్‌), ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రామకృష్ణ.

Advertisement
 
Advertisement
Advertisement