ఉత్సవం చెరి సగం | 24 Kisses First Look Still And Poster release | Sakshi
Sakshi News home page

ఉత్సవం చెరి సగం

Jul 7 2018 12:39 AM | Updated on Jul 7 2018 12:39 AM

24 Kisses First Look Still And Poster release - Sakshi

హెబ్బా పటేల్‌, అరుణ్‌ ఆదిత్

అరుణ్‌ ఆదిత్, హెబ్బా పటేల్‌ జంటగా ‘మిణుగురులు’ ఫేమ్‌ అయోధ్య కుమార్‌ కృష్ణంశెట్టి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘24 కిస్సెస్‌’. సిల్లీమాంక్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్, రెస్పెక్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై సంజయ్‌ రెడ్డి, అనిల్‌ పల్లెల, అయో«ధ్య కుమార్‌ నిర్మించారు. శుక్రవారం ఇంటర్నేషనల్‌ కిస్సింగ్‌ డే సందర్భంగా ఈ సినిమా ఫస్‌ ్టలుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘నీకో సగం నాకో సగం ఈ ఉత్సవం’ అనే ట్యాగ్‌లైన్‌ ఉన్న ఈ పోస్టర్‌కు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రం టీజర్‌ ఈ రోజు రిలీజ్‌ కానుంది. అదితి మ్యాక, రావు రమేశ్, నరేశ్‌ ముఖ్య పాత్రలు చేసిన ఈ సినిమాకు జాయ్‌ బరువ సంగీతం అందించారు. గిరిధర్‌ మావిడిపల్లి ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌.
∙హెబ్బాపటేల్, అరుణ్‌ ఆదిత్‌

Advertisement
 
Advertisement
Advertisement