ఒక ట్విస్ట్‌ ఉంది | 22 Telugu Movie Launch | Sakshi
Sakshi News home page

ఒక ట్విస్ట్‌ ఉంది

Jul 23 2019 4:02 AM | Updated on Jul 23 2019 4:02 AM

22 Telugu Movie Launch - Sakshi

వెంకటేశ్, రూపేశ్, సలోని

‘‘మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై శివకుమార్‌ బి. దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘22’. రూపేశ్‌కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా నాయకా నాయికలుగా నటిస్తున్నారు . యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న  ఈ చిత్రం ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. హీరో, హీరోయిన్లపై వెంకటేశ్‌ క్లాప్‌ ఇవ్వగా, నిర్మాతలు బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్, నవీన్‌ ఎర్నేని, కొండా కృష్ణంరాజులు కెమెరా స్విచాన్‌ చేశారు. భీమనేని శ్రీనివాసరావు తొలి షాట్‌కు  గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు హరీశ్‌ శంకర్‌ శివకుమార్‌కు స్క్రిప్ట్‌ అందిచారు. దర్శకుడు శివకుమార్‌.బి మాట్లాడుతూ– ‘‘టైటిల్‌లో ఉన్న 22 నంబర్‌కు కథలో ఓ ట్విస్ట్‌ ఉంది.

మర్డర్‌ మిస్టరీతో సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుంది. ఈ 29న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. నా బలం మా అమ్మ డైరెక్టర్‌ జయగారు. ఆవిడ ఎక్కడ ఉన్నా సంతోషిస్తారు. నాన్న బి.ఎ. రాజుగారు నన్ను ఎప్పుడూ సపోర్ట్‌ చేస్తూ ఎంకరేజ్‌ చేస్తున్నారు’’ అన్నారు. రూపేశ్‌కుమార్‌ చౌదరి మాట్లాడుతూ– ‘‘నేను వెంకటేశ్‌గారికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన సినిమాలు ఒక్కోటి 15 సార్లు చూసి ఉంటాను. అలాంటిది నా మొదటి సినిమాకు ఆయన వచ్చి క్లాప్‌ కొట్టడం థ్రిల్‌గా ఉంది’’ అన్నారు.‘‘ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమా ట్విస్ట్‌ అండ్‌ టర్న్‌లతో అందరికీ నచ్చే విధంగా ఉంటుంది’’ అన్నారు సలోని.

Advertisement
 
Advertisement
Advertisement