అందమైన ప్రేమకథ | 2 States done with Kolkata schedule | Sakshi
Sakshi News home page

అందమైన ప్రేమకథ

Jun 3 2018 1:37 AM | Updated on Jul 14 2019 4:31 PM

2 States done with Kolkata schedule - Sakshi

శివానీ రాజశేఖర్‌

అడవి శేష్, శివానీ రాజశేఖర్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘2 స్టేట్స్‌’ (వర్కింగ్‌ టైటిల్‌). చేతన్‌ భగత్‌ రాసిన ‘2 స్టేట్స్‌’ నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. వెంకట్‌ రెడ్డి కుంచం దర్శకత్వంలో ఎంఎల్‌వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్నారు. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం సెకండ్‌ షెడ్యూల్‌ కోల్‌కత్తాలో ముగిసింది. ఈ సందర్భంగా ఎంఎల్‌వి సత్యనారాయణ (సత్తిబాబు) మాట్లాడుతూ– ‘‘బ్యూటిఫుల్, క్యూట్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా రూపొందుతోన్న చిత్రమిది. హైదరాబాద్‌లో ఫస్ట్‌ షెడ్యూల్, కోల్‌కత్తాలో సెకండ్‌ షెడ్యూల్‌ పూర్తి చేశాం.

అడవి శేష్, శివానీ, భాగ్యశ్రీ, రజిత్‌ కపూర్, లిజి, ఆదిత్య మీనన్‌ కాంబినేషన్‌లో కీలకమైన టాకీ సన్నివేశాలను చిత్రీకరించాం. పూర్తయినంత వరకు రషెస్‌ చూశాం. సినిమా చాలా బాగా వస్తోంది. ఈ నెల 7న మూడో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘2 స్టేట్స్‌’ నవల చదువుతున్నంతసేపు పాఠకుడు ఎంతగా ఆస్వాదిస్తాడో, మా సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్‌ అంతకు  రెట్టింపు ఆస్వాదిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు వెంకట్‌ రెడ్డి కుంచం. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్, కెమెరా: షానియల్‌ డియో, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎం.ఎస్‌. కుమార్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement