నా వీక్‌నెస్‌ అదే! | 102 Not Out star Amitabh Bachchan about his weakness | Sakshi
Sakshi News home page

నా వీక్‌నెస్‌ అదే!

May 12 2018 2:15 AM | Updated on May 28 2018 4:05 PM

102 Not Out star Amitabh Bachchan about his weakness - Sakshi

అమితాబ్‌ బచ్చన్

అమితాబ్‌ బచ్చన్‌.. వందలకుపైగా సినిమాల్లో యాక్టర్‌గా మెప్పించారు. కొన్ని సినిమాలు నిర్మించారు కూడా. అంతేనా.. పాటలు పాడారు. చాలా సాంగ్స్‌ కంపోజ్‌ చేశారు. యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా, సింగర్‌గా, కంపోజర్‌గా అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో ప్రవేశం ఉన్న అమితాబ్‌ను డైరెక్షన్‌ కూడా చేస్తారా? అనే ప్రశ్న ముందుంచితే.. ‘డైరెక్షన్‌ చేయలేకపోవడమే నా వీక్‌నెస్‌’ అన్నారు.

డైరెక్షన్‌ గురించి అమితాబ్‌ మాట్లాడుతూ– ‘‘డైరెక్షన్‌ గురించి నాకు ఎక్కువగా తెలియదు. నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న ఏంటంటే.. కెమెరాను ఒక యాంగిల్‌లో పెట్టి షాట్‌ డిజైన్‌ చేస్తున్నప్పుడు దర్శకుడి మైండ్‌లో ఏం రన్‌ అవుతుంది. ఆ సమయంలో వాళ్లు ఎలా ఆలోచిస్తారు? అనేదే డౌట్‌. నేనెప్పటికీ సినిమాను డైరెక్ట్‌ చేయలేనేమో’’ అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement