breaking news
weekness
-
నా వీక్నెస్ అదే!
అమితాబ్ బచ్చన్.. వందలకుపైగా సినిమాల్లో యాక్టర్‌గా మెప్పించారు. కొన్ని సినిమాలు నిర్మించారు కూడా. అంతేనా.. పాటలు పాడారు. చాలా సాంగ్స్ కంపోజ్ చేశారు. యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా, సింగర్‌గా, కంపోజర్‌గా అన్ని డిపార్ట్మెంట్స్లో ప్రవేశం ఉన్న అమితాబ్‌ను డైరెక్షన్ కూడా చేస్తారా? అనే ప్రశ్న ముందుంచితే.. ‘డైరెక్షన్ చేయలేకపోవడమే నా వీక్నెస్’ అన్నారు. డైరెక్షన్ గురించి అమితాబ్ మాట్లాడుతూ– ‘‘డైరెక్షన్ గురించి నాకు ఎక్కువగా తెలియదు. నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న ఏంటంటే.. కెమెరాను ఒక యాంగిల్లో పెట్టి షాట్ డిజైన్ చేస్తున్నప్పుడు దర్శకుడి మైండ్‌లో ఏం రన్ అవుతుంది. ఆ సమయంలో వాళ్లు ఎలా ఆలోచిస్తారు? అనేదే డౌట్. నేనెప్పటికీ సినిమాను డైరెక్ట్ చేయలేనేమో’’ అని పేర్కొన్నారు. -
వర్షాకాలం... స్ప్రే, జెల్‌తో బలహీనం...
బ్యూటిప్స్ వర్షాకాలంలో శిరోజాల సంరక్షణ పెద్ద కష్టమేమీ కాదు. అలాగని, సులువుగా పూర్తిగా వదిలేయలేం. వెంట్రుకలు పొడిబారడం, చిట్లడం.. ఈ కాలం ప్రధాన సమస్యలుగా ఉంటాయి. ♦ఈ కాలం హెయిర్ స్ప్రేలు లేదా జెల్స్ ఉపయోగించకూడదు. వర్షంలో నానినప్పుడు స్ప్రే చేసినవి, జెల్ రసాయనాలు మాడుకు పట్టుకుంటాయి. ఇవి మాడును నిస్తేజంగా మార్చడం, వెంట్రుకల కుదుళ్లను బలహీనంగా మారుస్తాయి. ♦ ప్రతి రోజూ రాత్రి పడుకునేముందు మునివేళ్లతో మాడును మృదువుగా మర్దనా చేసుకోవాలి. దీంతో రక్తప్రసరణ మెరుగవుతుంది. ♦ చల్లగా ఉంటుంది కదా అని మరీ వేడి నూనెలను ఉపయోగించకూడదు. వారానికి ఒకసారి గోరువెచ్చని నూనెను మర్దనకు ఉపయోగించి, శుభ్రపరుచుకుంటే చాలు. ♦ పొడవాటి జుట్టును ఎక్కువసేపు గట్టిగా ముడివేయడం వంటివి కాకుండా, వీలైనంత వదులుగా ఉండేలా జాగ్రత్త తీసుకోవడం మంచిది. ♦ తలకు నూనె పెట్టి ఉండటం, అలాగే వర్షంలో తడవడం, ఆ తర్వాత రెండు రోజులకు శుభ్రం చే యడం ఇలాంటి విధానం వల్ల వెంట్రుకలు మరింత దెబ్బతినే అవకాశం ఉంటుంది. ♦ రాత్రిపూట తలకు నూనె పెట్టి మర్దన చేసి, మరుసటి రోజు ఉదయం షాంపూ లేదా శీకాకాయతో జుట్టును శుభ్రం చేసుకోవ డం మంచిది.