రెండోసారి గిన్నిస్‌ రికార్డు

Guinness record for the second time - Sakshi

 అనర్గళంగా గంట 11 నిమిషాల పాటు బోధన

హోలీమేరి ఇంజనీరింగ్‌ కళాశాల కార్యదర్శి ఘనత 

కీసర: అనర్గళంగా గంట 11 నిమిషాల పాటు బోధనలు చేయడం ద్వారా కీసర మండలం భోగారంలోని హోలీమేరి ఇంజనీరింగ్‌ కళాశాల కార్యదర్శి అరిమండ విజయశారదారెడ్డి గిన్నిస్‌ రికార్డు సాధించారు. గతంలో 250 మంది విద్యార్థులకు బోధన చేసి గిన్నిస్‌ రికార్డుల్లోకెక్కారు. తాజాగా 400 మంది విద్యార్థులకు మైండ్‌ఫుల్‌నెస్‌ అనే అంశంపై పాఠాలను బోధించడం ద్వారా రెండోసారి రికార్డు సాధించారు. సోమవారం కళాశాలలో ‘లార్జెస్ట్‌ మైండ్‌ఫుల్‌నెస్‌ లెసెన్‌’పేరిట ఆమె ఈ కార్యక్రమం నిర్వహించారు.  

యువకుల మనసుల్లో సద్భావనలు నింపి వారిని సన్మార్గంలో నడిపేందుకే మైండ్‌ఫుల్‌నెస్‌ కార్యక్రమం ఏర్పాటుచేశానని విజయ తెలిపారు. మైండ్‌ఫుల్‌నెస్‌ ధ్రువీకరణకు అవార్డు నిర్వాహకులకు పంపిస్తున్నట్లు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ ప్రతినిధి జయసింహ ప్రకటించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్‌ ఎ.వరప్రసాద్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ సిద్దార్ధారెడ్డి విజయశారదారెడ్డిని అభినందించారు.

Read latest Medchal News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top