వాలెంటైన్స్‌ డే స్పెషల్‌ ఈవెం‍ట్స్‌!

Valentine's Day 2020 Events in Hyderabad - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు మరింత దగ్గర పడింది. రేపు ఒక్కరోజు గడిస్తే ఆ మరుసటి రోజే ప్రేమికుల పండుగ. అయితే వాలెంటైన్స్‌ వీక్‌ పేరిట ప్రేమ పండుగ వేడుకలు ఐదురోజుల క్రితం నుంచే మొదలయ్యాయి. ఈ వారంలోని ప్రతీరోజు కానుకలతో ప్రేమికులు తమని తాము పలకరించుకుంటూనే ఉన్నారు. మిగితా రోజులకంటే వాలెంటైన్స్‌ డే ఎంతో ప్రత్యేకమైనది. అందుకే ప్రేమికులు ఆరోజును మరింత సంతోషంగా జరుపుకోవాలనుకుంటారు. అలాంటి వారు తమ ప్రియమైన వారితో అలా సరదాగా క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌లోనో, ఏదైనా ఈవెంట్‌లోనో గడిపితే ఆ కిక్కేవేరు. ఇందుకోసం ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పనిలేదు. మన హైదరాబాద్‌ నగరంలోనే వాలెంటైన్స్‌ డేన చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. మీరు చేయవల్సిందల్లా ఎక్కడికెళ్లాలో నిర్ణయించుకోవటమే..

ప్రేమికుల రోజున నగరంలో జరిగే కొన్ని ఈవెంట్స్‌ మీకోసం..

1) వాలెంటైన్స్‌ డే సెలబ్రేషన్స్‌ 
ప్రదేశం : హోటల్‌ సియెష్టా హైటైక్‌, గచ్చిబౌలీ-మియాపూర్‌ రోడ్‌, హనుమాన్‌ నగర్‌, మార్తాండ నగర్‌, కొండపూర్‌, హైదరాబాద్‌
సమయం : రాత్రి 7 గంటలకు
హైలెట్స్‌  : క్యాండిల్‌ లైట్‌ గాలా డిన్నర్‌
టిక్కెట్‌ ధర : రూ.799నుంచి

2) వాలెంటైన్స్‌ డే బాశ్‌ 2020
ప్రదేశం : ఎన్‌చేట్‌ కేఫ్‌ అండ్‌ కాన్‌ఫెక్సనరీ, ఫ్లాట్‌ నెంబర్‌ . 402, రోడ్‌ నెంబర్‌ 81, ఫిల్మ్‌ నగర్‌, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌
సమయం : ఉదయం 6 : 30 నుంచి రాత్రి 11:45వరకు
హైలెట్స్‌ : డీజే, లవ్‌ గేమ్స్‌, వీజే పాటలకు జుంబా డ్యాన్స్‌
టిక్కెట్‌ ధర : రూ. 2499( జంట)

3) హ్యాపీ హార్ట్స్‌
ప్రదేశం : ప్లిఫ్‌సైడ్‌ అడ్వంచర్‌ పార్క్‌,  ఐఎస్‌బీ రోడ్‌, ఫైనాన్‌షియల్‌ డిస్ట్రిక్ట్‌, నానక్‌రామ్‌గూడ, హైదరాబాద్‌
సమయం : సాయంత్రం 4 గంటలనుంచి 
హైలెట్స్‌ : పాటరీ వర్క్‌షాప్‌, ట్రెజర్‌ హంటర్‌, ఎంగేజ్‌మెంట్‌
టిక్కెట్ ధర : రూ.2,360(జంట)

4) హ్యాపీ వాలెంటైన్స్‌ డే పార్టీ
ప్రదేశం : స్పాయిల్‌ , 8-3-293/82/A/70, 4th ఫ్లోర్‌, అన్షూ కలర్స్‌ బిల్డింగ్స్‌, రోడ్‌నెంబర్‌ 1, చిరంజీవి బ్లడ్‌ అండ్‌ ఐ బ్యాంక్‌ ఎదురుగా, జూబ్లీహిల్స్‌, హైదరబాద్‌
సమయం : రాత్రి 1నుంచి ఉదయం 5 గంటల వరకు
హైలెట్స్‌ : కాంప్లిమెంటరీ ఫుడ్‌ అండ్‌ డ్రింక్స్‌
టిక్కెట్ ధర : రూ. 499

5) వాలెంటైన్స్‌ ఈవినింగ్‌ - రూఫ్‌టాప్‌ పూల్‌సైడ్‌ రొమాంటిక్‌ డైనింగ్‌ 
ప్రదేశం : మారియట్‌ ఎగ్జిక్యూటివ్‌ అపార్ట్‌మెంట్స్‌ , లెవెల్‌ 10, ఎస్‌ఎల్‌ఎన్‌ టెర్మినస్‌, సర్వే నెం: 133, బొటానికల్‌ గార్డన్‌ పక్కన హైదరాబాద్‌ 
సమయం : రాత్రి 7:30 గంటలకు
హైలెట్స్‌ : క్యాండిల్‌ లైట్‌ అండ్‌ స్టారీ నైట్‌
టిక్కెట్‌ ధర : రూ. 5,000( జంట) 

6) స్టాండ్‌అప్‌ కామెడీ షో
ప్రదేశం : జేఎక్స్‌టాపోస్‌, ప్లాట్‌ నెం:587, రోడ్‌ నెంబర్‌ 32, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌
సమయం : రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు
హైలెట్స్‌ : సందీప్‌ జానీ, యశ్‌ బజాజ్‌ కామెడీ
టిక్కెట్‌ ధర : రూ.235 (మగవారికి మాత్రమే)

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top