ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంది | Nagendra Prasad Sad Ending Love Story From Gudivada | Sakshi
Sakshi News home page

ఆమె కోసం రోజులు.. సంవత్సరాలు వెతికా!

Oct 21 2019 10:39 AM | Updated on Oct 30 2019 5:02 PM

Nagendra Prasad Sad Ending Love Story From Gudivada - Sakshi

ఆటోలో వెళుతుంటే ఏప్రిల్‌ 12న దారి మధ్యలో సరళ మా ఆటోను.. 

నేను పదవ తరగతి చదువుతున్న రోజుల్లో నా క్లాస్‌మేట్‌ సరళ నన్ను చూసేది. ఇప్పట్లోలా కాదు అప్పుడు! ఏమైనా చెప్పాలంటే చాలా భయం. పరీక్షలకు మూడు నెలల ముందు ఓ లెటర్‌లో ‘నాకు నువ్వంటే ఇష్టం’ అని రాసిచ్చింది. ఆ తర్వాతనుంచి ఇద్దరము చూసుకోవటం నవ్వుకోవటం చేసేవాళ్లమే కానీ, ఏనాడు దగ్గరగా వచ్చింది లేదు. అయినా మా మధ్య ప్రేమ పెరిగింది. పరీక్షలు అయిపోయాయి. స్టడీ కోసం అక్కడినుంచి గుడివాడ వచ్చేశాము. మా అక్కకు మధ్యమధ్యలో లెటర్లు రాసి అందులో నా గురించి ప్రస్తావించేది. దురదృష్టవశాత్తు వాళ్ల మేనత్త చనిపోతే ఆమెను వాళ్ల మామకు ఇచ్చి పెళ్లి చేశారు. 8 ఏళ్ల తర్వాత వాళ్ల అమ్మతో గుడివాడలో కనిపించింది. బస్టాండ్‌లో కలిసి కొంచెం సేపు మాట్లాడాను. మనసులో చెప్పలేని ఆనందం. తను హ్యాపీగా ఉంది అని ఫీల్‌ అయ్యేలోపు ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడని పేపర్లో చదివా. చెప్పలేని బాధ వేసింది. ఆరేళ్ల తర్వాత నాకు పెళ్లైన కొత్తలో భార్యతో కలిసి ఆటోలో వెళుతుంటే దారి మధ్యలో సరళ మా ఆటోను ఆపింది. ఆటోలో నా పక్కనే కూర్చుంది. తన చేతిలో నోకియా ఎన్‌70 ఫోన్‌ ఉంది. మాట్లాడదామా, పలకరిద్దామా అన్న సంశయంలో ఉండిపోయాను.

కొత్తగా పెళ్లైంది, నా భార్య ఏమైనా అనుమానిస్తుందేమో అని ఆలోచించేలోపే తను గుడివాడ ఆర్‌సీఎమ్‌ ఆసుపత్రి దగ్గర దిగేసింది. నేను ఇంటి దగ్గర ఆటో దిగి, బండివేసుకుని వెనక్కు వెళ్లి ఆ చుట్టుపక్కల వెతికా కనిపించలేదు. అలా చాలా రోజులు వెతికా సంవత్సరాల తరబడి. అది జరిగి 11ఏళ్లు అయిపోయింది. ఒకే ఒక్కసారి కనపడితే బాగుండు అని ఎదురు చూస్తూనే ఉన్నా. కనపడ్డపుడు పలకరించలేకపోయానే అనే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు నా వయస్సు 40 సంవత్సరాలు ఎప్పుడైనా కనిపించకపోతుందా అని ఎదురు చూస్తున్నా. 
- నాగేంద్ర ప్రసాద్‌, గుడివాడ( పేర్లు మార్చాం)


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement