వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేకి మాతృవియోగం | ysrcp mla Rakshana Nidhi Mother Dies | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే రక్షణనిధికి మాతృవియోగం

Feb 19 2018 3:24 PM | Updated on May 29 2018 2:33 PM

ysrcp mla Rakshana Nidhi Mother Dies  - Sakshi

సాక్షి, విజయవాడ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రక్షణనిధికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి కొక్కిలిగడ్డ సూర్యకాంతం (86) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. పలువురు వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు నివాళులు... తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెంలో సూర్యకాంతమ్మ భౌతికకాయాన్ని సందర్శించిన అర్పించారు. నివాళులు అర్పించినవారిలో కృష్ణాజిల్లా ఇన్‌ఛార్జ్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నూజివీడు ఎమ్మెల్యే మేక ప్రతాప్‌ అప్పారావు, పార్టీ నేతలు కొలుసు పార్థసారధి, వెల్లంపల్లి శ్రీనివాస్‌, అనిల్‌ కుమార్‌, సింహాద్రి రమేష్‌, మేరుగ నాగార్జున తదితరులు ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యే రక్షణనిధిని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఫోన్‌లో పరామర్శించి, ఆయన తల్లి మృతి పట్ల సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement