అడియాశలేనా!

check dam construction delay - Sakshi

పన్నెండేళ్లయినా పూర్తికాని చెడ్‌డ్యాం నిర్మాణం

రూ.12 లక్షలు నీటిపాలు 

ములకలపల్లి : మండలంలోని మాధారం గ్రామ శివారులోని పాములేరు వాగుపై 200 ఎకరాలకు సాగునీరించే లక్ష్యంతో చేపట్టిన చెక్‌డ్యాం నిర్మాణం శిలాఫలకానికే పరిమితమైంది. సుమారు పన్నెండేళ్ల క్రితం అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ‘నీరు మీరు’పథకంలో దీనిని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ముప్‌పై లక్షల రూపాయల వ్యయంతో ఈచెక్‌డ్యాం నిర్మించేందుకు సన్నాహాలు చేశారు. ఆయకట్టు కమిటీ ఆధ్వర్యంలో సుమారు 12 లక్షల రూపాయల ఖర్చు చేసి పునాది దశ వరకూ నిర్మించారు కూడా. ఈతర్వాత ఈనిర్మాణం అర్థాంతరంగా ఆగిపోయంది. దీని పునాది నిర్మాణం కోసం ఖర్చు చేసిన 12 లక్షల రూపాయలు వృథాగా నీటిపాలయ్యాయి.

ఈలోగా ప్రభుత్వం మారడంతో నిర్మాణం ఊసేలేకుండా పోయింది. చెక్‌డ్యాం నిర్మాణంతో తమ పంట పొలాలు సస్యశ్యామల మవుతాయని ఆశించిన రైతుల ఆశలు ఆడియాసలయ్యాయి. తెలంగాణా రాష్ట్రంలోనేనా పాలకపక్షాలు నిధులు మంజూరు చేసి చెక్‌డ్యాం నిర్మాణాన్ని పూర్తిచేయాలని, లేదా నూతనంగా మరో డిజైన్‌ రూపొందించి చెక్‌డ్యాం నిర్మాణం జరిగేలా చూడాలని ఆయకట్టు రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top