మరదలి గొంతు కోశాడు | attack by knife | Sakshi
Sakshi News home page

మరదలి గొంతు కోశాడు

Jan 9 2018 10:32 AM | Updated on Jan 9 2018 10:32 AM

సాక్షి, నేలకొండపల్లి  : కుటుంబ కలహాల కారణంగా ఓ బావ మరదలి గొంతు కోసిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలం చెరువుమాధారం గ్రామానికి చెందిన షేక్‌ రబ్బాని భార్య ఇటీవల భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి రబ్బాని మానసిక స్థితి బాగాలేదు.

ఇంటి చుట్టు పక్కల వారితో మీ వల్లనే నా భార్య వెళ్లిపోయిందని ఇటు కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో కొంత మందితో తరుచూ గొడవ పడి చంపుతానని బెదిరించే వాడని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ నేపధ్యంలోనే సోమవారం తన మరదలు షేక్‌ రియాన్‌ బేగం(25)తన పిల్లలకు స్నానం చేయించి ఇంట్లో వరండాలో బట్టలు ఆరవేస్తుండగా అదే సమయంలో రబ్బాని 18 ఇంచుల కత్తితో వెళ్ళి ఆమె గొంతు కోయడమేకాక విచక్షణారహితంగా మూడు చోట్ల పొడిచాడు. ఎడమ చేయి, మెడ మీద, కుడి భుజం మీద మూడు చోట్ల కత్తితో దాడి చేశాడు.

దీంతో రియాన్‌బేగం స్పృహతప్పి పడిపోయింది. అప్పుడే ఇంటికి వచ్చిన ఆమె భర్త మహ్మద్‌ సంఘటన చూసి బోరున విలపించాడు. వెంటనే 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి  తరలించారు. గొంతు కొసి కత్తితో సహా రబ్బాని పారిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఇన్‌చార్జీ ఎస్సై లవణ్‌కుమార్‌ వివరాలు సేకరించారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. రియాన్‌బేగంకు ఇద్ధరు పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement