మిస్‌ కర్ణాటక రాణి

miss karnataka rani - Sakshi

సవితాకు మిసెస్‌ కర్ణాటక కిరీటం

సాక్షి, శివాజీనగర : బెంగళూరు నగరానికి చెందిన ఇశ్‌ ఈవెంట్‌ సంస్థ నిర్వహించిన అందాల పోటీల్లో దావణగెరెకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థిని మిస్‌ కర్ణాటక కిరీటాన్ని ధరించగా, మండ్య జిల్లా మళవళ్లికి చెందిన సవితా ఎం.శంకర్‌ మిసెస్‌ కర్ణాటక కిరీటాన్ని ధరించారు.

గత నెల 15 నుంచి మూడు రోజుల పాటు కనకపుర రోడ్డులోని ఓ ప్రైవేట్‌ రెసార్ట్‌లో ఏర్పాటు చేసిన బ్యూటీ మిసెస్‌ కర్ణాటక, మిస్‌ కర్ణాటక పోటీలను నిర్వహించారు. ఇందులో ప్రేక్షకులతో పాటు పోటీదారులు 600 మందికిపైగా ఇందులో సవితా ఎం.శంకర్‌ మిసెస్‌ కర్ణాటక విన్నర్‌గాను, బ్యూటీ మిస్‌ పోటీలో రాణి గెలుపొందారని ఇశ్‌ ఈవెంట్‌ సంస్థ డైరెక్టర్‌ వీరేశ్‌ శనివారం మీడియాకు తెలిపారు. పుష్ఫ, వైష్ణవి ద్వితీయ, తృతీయ స్థానంలో గెలుపొందారని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలో జరిపిన అందాల పోటీల్లో 28 మంది ఎంపికయ్యారన్నారు. డైరెక్టర్‌ వీరు, ఫ్యాశన్‌ డిజైనర్‌ శ్వేతా కార్యక్రమాన్ని రూపొందించారని, ప్రముఖ సినీ నటుడు సుదీప్‌ కార్యక్రమ అంబాసిడర్‌గా వ్యవహరించారని తెలియజేశారు. వెంకటేశ్, చామరాజ్, అమరేష్, రఘునందన్‌ కార్యక్రమ ప్రమోటర్స్‌గా ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా మిస్, మిసెస్‌ కర్ణాటక కిరీటాన్ని ధరించిన రాణి, సవితా, వైష్ణవి విలేకరులతో మాట్లాడుతూ అందాల పోటీలు కేవలం నగరాలకు పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలవారికి కూడా అవకాశం కల్పించిన ఈశ్‌ ఇవెంట్‌ సంస్థకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

అందాల పోటీల్లో ప్రతిభా, క్రీడా, సంప్రదాయ పోటీలు జరుగుతాయని, ఇందులో పాల్గొనటం తమకు ఎంతో ఆనందం కలిగిస్తోందని తెలిపారు.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top