ఎమ్మెల్యే కుమారుడి వీరంగం..  | Ministers son Allegedly Beats Up Man At Bengaluru Restaurant | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కుమారుడి వీరంగం.. 

Feb 19 2018 2:46 AM | Updated on Feb 19 2018 2:46 AM

Ministers son Allegedly Beats Up Man At Bengaluru Restaurant - Sakshi

మహమ్మద్‌ నలపాడ్‌( ఫైల్‌ ఫోటో)

బెంగళూరు: శాంతినగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హ్యారిస్‌ కుమారుడు మహమ్మద్‌ నలపాడ్‌ తన 10 మంది స్నేహితులతో కలసి శనివారం అర్ధరాత్రి ఓ రెస్టారెంట్‌లో వీరంగం సృష్టించాడు. ఈ ఘటనలో విద్వత్‌ అనే వ్యక్తిని చితకబాదడంతో అతను ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో ఎమ్మెల్యే కుమారుడు, అతని స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బెంగళూరు యూత్‌ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీగా ఉన్న మహమ్మద్‌ నలపాడ్‌ను ఆరేళ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ కేపీసీసీ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఎమ్మెల్యే హ్యారిస్‌ స్పందిస్తూ.. ‘‘ఇది దురదృష్టకరమైన ఘటన.. బాధితుడి కుటుంబసభ్యులను పరామర్శించాను. నా కుమారుడు నలపాడ్‌ ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి ఉంది’’అని అన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఘటనకు సంబంధించి  ‘‘నిందితుడు ఎంతటి వ్యక్తి అయినా శిక్ష అనుభవించాల్సిందే’’అని  ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement