జుంబారే జుంజుంబరే! | Zumba Stars Philippines Dance Concert | Sakshi
Sakshi News home page

జుంబారే జుంజుంబరే!

Jul 20 2015 1:45 AM | Updated on Sep 3 2017 5:48 AM

ఫొటో చూస్తే ఏమనిపిస్తోంది. వేలాది మంది మూకుమ్మడిగా రోడ్లపైకొచ్చి యోగా, ఎరోబిక్స్ అభ్యసిస్తున్నట్లు ఉంది కదా? నిజమే.

ఫొటో చూస్తే ఏమనిపిస్తోంది. వేలాది మంది మూకుమ్మడిగా రోడ్లపైకొచ్చి యోగా, ఎరోబిక్స్ అభ్యసిస్తున్నట్లు ఉంది కదా? నిజమే. వీరంతా ఫిలిప్పీన్స్ దేశంలో తెగ పాపులర్ అయిన ‘జుంబా’ డ్యాన్స్ ఫిటినెస్ కార్యక్రమాన్ని సాధన చేస్తున్నారు.

పనిలో పనిగా కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించాలని కదం తొక్కారు. ఒకే వేదికపై 12,975 మంది జుంబా ప్రాక్టీస్ చేసి కొత్త రికార్డును తమ పేరిట నమోదు చేసుకున్నారు. ఫిలిప్పీన్స్‌లోని మాండలుయాంగ్ నగరంలో ఆదివారం తీసిందీ ఫొటో.

Advertisement
 
Advertisement
Advertisement