ఆమె రాజీనామాను తిరస్కరించిన ట్రంప్ | Writer apologises for copying phrases for Melania Trump's speech | Sakshi
Sakshi News home page

ఆమె రాజీనామాను తిరస్కరించిన ట్రంప్

Jul 21 2016 9:29 AM | Updated on Sep 4 2017 5:41 AM

ఆమె రాజీనామాను తిరస్కరించిన ట్రంప్

ఆమె రాజీనామాను తిరస్కరించిన ట్రంప్

రిపబ్లికన్ అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియాకు కాపీ స్క్రిప్ట్ అందించిన మెరిడిత్ మెకైవర్ క్షమాపణ చెప్పారు.

వాషింగ్టన్: రిపబ్లికన్ అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియాకు కాపీ స్క్రిప్ట్ అందించిన మెరిడిత్ మెకైవర్ క్షమాపణ చెప్పారు. అంతేకాదు తన పదవిని వదులుకునేందుకు సిద్ధపడ్డారు. అయితే ఆమె రాజీనామాను ట్రంప్ తిరస్కరించారని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. 'ఇది నా తప్పు. మెలానియా, ట్రంప్ నా కారణంగా విమర్శల పాలయ్యారు. మిషెల్ ఒబామా కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింద'ని మెరిడిత్ పేర్కొన్నారు.

క్లీవ్‌లాండ్‌లో రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో సోమవారం మెలానియా ప్రసంగించారు. 2008లో ఒబామా భార్య మిషెల్ చేసిన ప్రసంగం నుంచి మెలానియా కాపీ కొట్టారని విమర్శలు పోటెత్తాయి. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆమె స్టాఫ్ రైటర్ గా పనిచేస్తున్నారు. ట్రంప్ కు చిరకాల మిత్రురాలైన మెరిడిత్ కు ఆయన కుటుంబంతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే మిషెల్ అంటే మెలానియా చాలా ఇష్టమని మెరిడిత్ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement