ఛీ..యాక్‌.. ఇంత వికృతమా!

Woman licks ice cream and puts it back in store freezer - Sakshi

ఓ యువతి షాప్‌లోని ఐస్‌క్రీమ్‌ను తన నాలుకతో చప్పరించి.. ఆ తర్వాత దానిని తిరిగి ఫ్రీజ్‌లో పెట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోపై సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

ఇది సరదాకు చేసిన వీడియోలా కనిపిస్తోంది. ఈ వీడియోలో సదరు యువతి ఓ కిరాణ కొట్టులోని ఫ్రీజ్‌ నుంచి బ్లూ బెల్లా ఐస్‌క్రీమ్‌ టబ్‌ మూత తీసి.. వికారంగా నాలుకను బయటకు తీసి.. ఆ ఐస్‌క్రీమ్‌ను చప్పరించింది. అనంతరం మళ్లీ ఐస్‌క్రీమ్‌ టబ్‌కు మూతపెట్టి.. మళ్లీ దానిని యథాతథంగా ఫ్రీజ్‌లో పెట్టింది. ఈ వీడియోలో నవ్వుతూ ఆమె ఇలా చేస్తుండగా ఆమె స్నేహితురాలు ప్రోత్సహిస్తున్న మాటలు వినిపిస్తున్నాయి. తొమ్మిది సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోని ఎక్కడ తీశారు? ఎవరీ యువతి? ఈ ఘటన ఎక్కడ జరిగింది? తెలియరాలేదు. ఎంతటి సైకో ప్రవర్తన ఇది? అంటూ బ్లైండ్‌ డెన్సెస్టు అనే నెటిజన్‌ ఈ వీడియోను  ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోలో ఆ యువతి చర్య చాలా వికృతంగా, దారుణంగా ఉందని, ఇలా ప్రవర్తించిన యువతిపై క్రిమినల్‌ అభియోగాలు నమోదు చేయాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top