హ్యాండ్‌బ్యాగ్‌ కోసం ఎంత పని చేసింది..!

Woman Enters X Ray Machine on Fear of Theft - Sakshi

గ్వాగ్‌డాంగ్‌, చైనా : పబ్లిక్‌ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే సెక్యూరిటీ చెక్స్‌ల్లో వస్తువులు పోతాయని ఎప్పుడైనా మీరు భయపడ్డారా?. చైనాలోని ఓ మహిళ అలానే భయపడ్డారు. మరో ఆలోచన లేకుండా రైల్వే స్టేషన్‌లో సెక్యూరిటీ చెక్స్‌లో భాగంగా వినియోగించే ఎక్స్‌ రే మెషీన్‌లోకి హ్యాండ్‌ బ్యాగ్‌తో పాటు తాను కూడా ఎక్కారు. ఈ ఘటన దక్షిణ చైనాలో గల గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్సులోనిలో రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది.

ఎక్స్‌ రే మెషీన్‌ స్క్రీన్‌లో మహిళ ఇమేజ్‌ను చూసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. హైహీల్స్‌తో పాటే ఆమె ఎక్స్‌రే మెషీన్లోకి వెళ్లారు. దీంతో ఆమె జాగ్రత్తగా బయటకు వస్తుందో లేదో? అని ఆందోళన చెందారు. మెషీన్‌లో నుంచి ఆమె భద్రంగా బయటకు రావడంతో అంతా ఊపరిపీల్చుకున్నారు. మహిళ ఎక్స్‌ రే ఇమేజ్‌లు చూసిన నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు. మరి మీరు మహిళ ఎక్స్‌ రే  ఫొటోలపై ఓ లుక్కేయండి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top