ఈ ఏడాది చివరికల్లా కోవిడ్‌ వాక్సిన్‌ | WHO hopeful Covid-19 vaccines could be available before end of this year | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది చివరికల్లా కోవిడ్‌ వాక్సిన్‌

Jun 19 2020 6:44 AM | Updated on Jun 19 2020 6:44 AM

WHO hopeful Covid-19 vaccines could be available before end of this year - Sakshi

డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌

లండన్‌: ఈ ఏడాది చివరికల్లా కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావంతో ఉన్నట్టు ఆ సంస్థ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. కరోనా వైరస్‌ తాజా ఔష«ధ ప్రయోగాలపై జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్‌ సౌమ్య మాట్లాడారు. పదిమందిపై వ్యాక్సిన్‌ క్లినికల్‌ ప్రయోగం జరుగుతోందని, వారిలో కనీసం ముగ్గురు వ్యాక్సిన్‌ సామర్థ్యాన్ని రుజువు చేసే ప్రయోగం మూడవ దశకు చేరుకున్నారని డాక్టర్‌ సౌమ్య చెప్పారు. గేమ్‌ చేంజర్‌ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కితాబిచ్చిన హైడ్రాక్సిక్లోరోక్విన్‌కి కోవిడ్‌ మరణాలను నివారించే శక్తి లేదని మానవ ప్రయోగాల్లో తేలిపోయిందని సౌమ్య చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement