
ఇలా అంటే.. అలా ఆరిపోద్ది..
తలస్నానం చేశాం.. శిరోజాలను ఆరబెట్టుకోవడానికి హెయిర్ డ్రయర్ కోసం వెతుకుతున్నారా?
తలస్నానం చేశాం.. శిరోజాలను ఆరబెట్టుకోవడానికి హెయిర్ డ్రయర్ కోసం వెతుకుతున్నారా? ఇకపై అలాంటివక్కర్లేదు. పర్యావరణ అనుకూలమైన ఈ హెయిర్ డ్రయింగ్ గ్లోవ్స్ ఉంటే చాలు. ఎంచక్కా.. జుత్తును ఆరబెట్టేసుకోవచ్చు. ఇందులో ఉండే అత్యాధునికమైన మైక్రో ఫైబర్లు వెంటనే నీటిని పీల్చేసుకుంటాయి. పైగా.. వేడి గాలితో జుత్తును ఆరబెట్టడం వల్ల శిరోజాలు పాడయ్యే అవకాశమూ ఉందని దీన్ని విక్రయిస్తున్న ఆన్‌లైన్ రీటైల్ సంస్థ ‘హెమాకర్ ష్లెమర్’ తెలిపింది. మామూలు తువ్వాలుతో పోలిస్తే.. ఈ మైక్రో ఫైబర్లు రెండు రెట్లు అధికంగా నీటిని పీల్చుకుంటాయట. దీని ధర రూ.1,300